అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్. సాయి పల్లవి హీరోయిన్గా చందు మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు దేవి ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై.. అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నిజ జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో.. అక్కినేని ఫ్యాన్స్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కానీ.. ఈ సినిమాకు ఉన్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతుందట. ఇంతకీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. కొంతకాలం క్రితం నాగ చైతన్య హీరోగా.. చందు మొండేటి డైరెక్షన్‌లో ప్రేమమ్ సినిమా తెరకెక్కింది. మంచి అంచనాలు నడుమ ఈ సినిమా రిలీజ్ అయిన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో సవ్యసాచి.. రిలీజైంది. ఈ మూవీ కూడా ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసినా.. ప్రేక్షకులను ఊహించిన రేంజ్‌లో మెప్పించలేకపోయింది.
ఇలా ఇప్పటివరకు చైతు, చందు మొండేటి కాంబోలో రూపొందిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే మరోసారి వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నా.. మరోసారి ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ ఒక్క బ్యాడ్ సెంటిమెంట్ తప్పుకుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో.. ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.