సినీ ఇండస్ట్రీలో ఎలాంటి హీరోలకైనా.. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్లకైనా హిట్లు, ప్లాప్‌లు కామన్. అయితే హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్లు మాత్రం ఏ మూవీ అయినా పర్వాలేదు అనిపించుకుంటాయి. ఇక స్టార్ హీరోలు సినిమాలైతే ఫస్ట్ డే కలెక్షన్స్ తో సంచలనాలు క్రియేట్ చేస్తాయి. కానీ.. ఒకసారి సినిమా టాక్ బయటకు వచ్చిన తర్వాత భారీ లాభాలు అందుకోవాలంటే మాత్రం లాంగ్ రన్‌లోను అదే రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టాల్సి ఉంటుంది. అప్పుడే సినిమా ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తంలో లాభాలు దక్కుతాయి. ఒకవేళ సినిమా నెగిటివ్ టాక్ వచ్చిందంటే ఇక సినిమాకు కలెక్షన్లు రావడం చాలా కష్టం. కాగా ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో అలా చాలా సినిమాలు లాంగ్ రన్‌లోను అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఇకపోతే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కోటి రూపాయలకంటే ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 5 సినిమాల లిస్టు ప్రస్తుతం వైరల్‌గా మారుతుంది. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
బాహుబలి పార్ట్ 2:
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా సీక్వెల్ గా బాహుబలి 2 వచ్చి ఏకంగా 28 రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.
పుష్ప పార్ట్ 2:
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు రష్మిక మందన హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్స్ కలుపుకుని ఏకంగా 26 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను దక్కించుకుంది.
బాహుబలి పార్ట్ 1:
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా బాహుబలి. ఈ సినిమా 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లు కొల్లగొట్టింది.
సంక్రాంతికి వస్తున్నాం:
విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా 20 రోజులపాటు కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.
హనుమాన్:
యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు.. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోస్‌తో కలుపుకొని దాదాపు 20 రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లు సొంతం చేసుకుంది.