సిల్క్ స్మిత చనిపోయేముందు ఆ హీరోకి కాల్ చేసిందా.. ఇప్పటికీ రెగ్రెట్ అవుతున్న స్టార్ హీరో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మత్తు కళ్ళ బ్యూటీ సిల్క్ స్మితకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తన నిషా కళ్ళు, నాజుకు వయ్యారులతో మత్తులు చిమ్మిన‌ ఈ ముద్దుగుమ్మ.. సినీ ప్రియుల ఆరాధ్య దేవతగా మారిపోయింది. 1990లో ఇండ‌స్ట్రీనిషేక్ చేసిన ఈ అమ్మడు.. అప్పట్లో ఓ సంచలనం. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసేవారంటే ఏ రేంజ్‌లో ఆమె క్రేజ్ దక్కించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సినిమాలు, అంతకుమించి స్పెషల్ సాంగ్స్‌తో సినీ రంగంలో యువరాణిలా వెలుగు వెలిగింది. నిజ జీవితంలో మాత్రం ప్రేమ మోసంతో బలైపోయింది. ఈ అమ్మడు అతి త‌క్క‌వ‌ సమయంలోనే స్టార్‌డంను సంపాదించుకుంది. చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచి అంద‌రికీ షాక్ ఇచ్చింది.

Silk Smitha Birth Anniversary మేకప్ ఆర్టిస్టు నుంచి స్టార్‌గా.. సూసైడ్‌కు  ముందు ఫోన్ కాల్ ఎవరికంటే? | Silk Smitha Birth Anniversary: Layanam Actor  last call to Ravichandran before death - Telugu ...

ఇప్పటికీ ఈమె మరణం ఇండస్ట్రీలో తీరని లోటు. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో సూసైడ్ చేసుకొని సిల్క్ స్మిత చనిపోవడం వెనక.. ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ స్టార్ హీరోకు కాల్ చేసిందని.. ఆ విషయంలో ఇప్పటికే స్టార్ హీరో రిగ్రెట్ అవుతున్నారని సమాచారం. ఈ విషయాని స్వయంగా స్టార్ హీరో వెల్లడించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె చనిపోయే ముందు కన్నడ హీరో రవిచంద్రన్‌కు కాల్ చేసిందట. వీరిద్దరూ కలిసి 1992లో హళ్లి మేస్త్రి అనే సినిమాలో కనిపించారు. అప్పటినుంచి వీళ్ళ స్నేహం బలపడిందని.. చనిపోయే ముందు వరకు కూడా వీరి స్నేహం కొనసాగిందని అతను చెప్పుకొచ్చాడు.

సిల్క్ స్మిత మరణం వెనక సంచలన నిజాలు చెప్పిన స్టార్ హీరో..

స్మిత తనని చాలా గౌరవించేదని.. తాను కూడా ఆమె పట్ల గౌరవంగా వ్యవహరించే వాడినంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్. సిల్క్ స్మిత చనిపోయే ముందు నాకు ఫోన్ చేసిందని.. తను న‌న్ను కలవాలని ట్రై చేసిందేమో.. కానీ నేను వీలు కుదరక ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు. షూటింగ్ టైంలో బిజీగా ఉండడంతో రెగ్యులర్ కాల్ అని భావించా. మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఉండాల్సిందేమో.. కాల్ లిఫ్ట్ చేసి ఉంటే ఇంత దారుణం జరగకపోయి ఉండేదేమో అంటూ.. ఆవేదన వ్యక్తం చేశాడు రవిచంద్రన్. 1996 సెప్టెంబర్ 27వ తారీకు సిల్క్ స్మిత కాల్ చేసిందని చెప్పుకొచ్చిన ఆయన.. ఆ రోజే తన ఆత్మహత్య చేసుకుందని వివరించాడు. ఆమె చనిపోవడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం అంటూ ఎమోషనల్ అయ్యారు. కాల్ లిఫ్ట్ చేయనందుకు ఇప్పటికీ రిగ్రెట్‌ ఫీలవుతున్నానని చెప్పుకొచ్చాడు.