మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజరక్ సినిమా ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించాడు చరణ్. ఒక పాత్రలో తండ్రిగా.. మరో పాత్రలో కొడుకుగా కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తండ్రి పాత్రలో నటించిన చరణ్‌కు జంటగా అంజలి.. కొడుకు పాత్రకు జంటగా కియారా అద్వానీ మెరిశారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య కనిపించాడు. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జై రామ్ తదితరులు కీలకపాత్రలో మెరిశారు.
థమన్ సంగీతం అందించిన ఈ సినిమా.. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాతో పాటు డాకు మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను కూడా.. ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 13న డాకుమహరాజ్.. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను రిలీజ్ చేశారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మూడు సినిమాలలో గేమ్ ఛేంజర్ సినిమా ఆడియన్స్‌ను సరిగ్గా ఆకట్టుకోలేక.. ఫ్లాప్‌గా నిలిచింది.
అయితే గేమ్ ఛేంజర్ సినిమా.. ఫిబ్రవరి 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానంది. ఇక అమెజాన్ ప్రైమ్ డిజిటల్ సంస్థ వారు ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే.. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన డాకు మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్‌లో మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో అందరికన్నా ముందే రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలోకి వస్తున్నందుకు మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో ఎలాంటి ఆదరణ అందుకుంటుందో వేచి చూడాలి.