టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న పాయల్ రాజ్‌పుత్.. తను నటించిన మొట్టమొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక బోల్డ్ బ్యూటీగా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు కెరీర్‌ను యూటర్న్ తిప్పిన మూవీ అనగానే టక్కున మంగళవారం పేరే గుర్తుకొస్తుంది. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సైకలాజికల్ మిస్టరీ సినిమాను డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించారు. అజయ్ గోష్ తదితరులు నటించి మెప్పించారు. ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్‌గా మంగళవారం 2 రూపొందించడానికి మేకర్స్ సిద్ధమైనట్లు వెల్లడించారు.
డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా స్క్రిప్ట్‌ను పూర్తి చేసేసారని.. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి రానిందంటూ టాక్ నడుస్తుంది. అయితే.. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ రిత్య.. సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాదు.. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు.. హీరోయిన్గా నటించిన పాయల్ మార్కెట్ మరింతగా పెరిగింది. కానీ.. మంగళవారం 2లో పాయల్ హీరోయిన్ కాదని విషయం అభిమానులకు బిగ్ షాక్ కలిగించింది. మంగళవారం 2లో ఎవ్వరు ఊహించని ఓ స్టార్ క్రేజీ బ్యూటీని తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ యంగ్ హీరోయిన్ కోసం సంప్రదింపులు కూడా జరుపుతున్నారట.
త్వరలోనే ఈ హీరోయిన్ పై అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ కూడా రానుందని సమాచారం. ఇలాంటి టైంలో దీనికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఇక ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్‌లో హీరోయిన్ శ్రీలీల నటించనుందని సమాచారం. ఇప్పటికే కథ నచ్చడంతో.. ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని టాక్ నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. శ్రీ లీల ఇలాంటి బోల్ట్ కంటెంట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. షాక్‌ను కలిగిస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నితిన్‌తో కలిసి శ్రీలల ఓ సినిమాల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. అలాగే రవితేజతో మరో సినిమాలో కనిపించనుంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు.. రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో శ్రీలీల మంగళవారం 2 సినిమాలో నటించబోతున్న న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.