ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రెటీస్ కూడా అభిమానులతో మరింత ఇంట్రాక్షన్లు పెంచుకొనేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తమ అభిరుచులు, ఇష్టాఇష్టాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ చిన్ననాటి ఫోటోలు కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. అలా తాజాగా ప్రస్తుతం మనం చూస్తున్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ.. ఈ ఫోటోలో ఉన్న చిన్నదాన్ని గుర్తుపట్టారా.. ఈమె ఓ స్టార్ హీరోయిన్.
తనదైన అందం, అభినయంతో కుర్రాళ హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల సౌత్ స్టార్ హీరోను వివాహం చేసుకుంది. ఉత్తరాదితో పాటు.. దక్షిణాదిలోను తన సత్తా చాటుకుంటుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ హీరోయిన్ రాజుల కుటుంబానికి చెందిన అమ్మాయి కూడా. ఇంతకీ ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఈ క్యూటీపై మరెవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ అదితీరావు హైదారి. అధితి తాత అక్బర్ హైదారి. ఆయన హైదరాబాద్ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. మరో తాత రామేశ్వరరావు (తల్లి తండ్రి) తెలంగాణలోని వనపర్తికి చెందిన వ్యక్తి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు.. అధితికి దగ్గర చుట్టమే.
ఇక ఈ అమ్మడు రెండేళ్ల వయసున్న సమయంలోనే ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లితో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే 2006లో సినీ రంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ అని భాషలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. స్టార్ హీరో సిద్ధార్థ్‌తో కలిసి మహాసముద్రం సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఈ సినిమా టైంలో అతనితో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్యన స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇటీవల అధితి పూర్వీకుల సంస్థాన పరిధిలో ఉన్న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అధితి సినిమాలకు దూరంగా ఉంటూ మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.