తండేల్ దుబాయ్ ప్రివ్యూ షో టాక్ ఇదే.. ఆ ట్విస్ట్‌ల‌కు ఆడియన్స్‌కు పూనకాలే..!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా పై ఆడియ‌న్స్‌లో ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైతు గతంలో నటించిన ఏ సినిమాలకు లేని రేంజ్‌లో ఈ సినిమాపై ఆడియన్స్‌ను అంచ‌నాలు నెలకొన్నాయి. కారణం ఓ యదార్ధ గాధ ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడమే. అంతే కాదు.. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాటలు, ట్రైలర్లు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. సుమారు రూ.80 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడుగా వ్యవహరించారు. కాఆ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తాజ‌గా ప్రారంభమయ్యాయి. కేవలం బుక్ మై షో నుంచి సినిమాకు ఇప్పటివరకు రూ.50 వేలకు పైగా టికెట్లు కొనుగోలు అయినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. దుబాయిలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్‌షో కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. అక్కడ బయర్స్‌తో పాటు.. ఎంతోమంది ముఖ్య ప్రముఖులు కూడా ఈ ప్రీమియర్ షోలకు హాజరై.. సినిమాను వీక్షించారు. తర్వాత వీరు చెప్పిన రివ్యూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఫస్ట్ హాఫ్ హీరో, హీరోయిన్ల మధ్యన తీసిన లవ్ సీన్స్ రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా అనిపించాయని.. కాస్త సీన్స్ ఎంగేజింగ్‌గా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఇక సెకండ్ హాఫ్ అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెర‌కెక్కించారని.. ఎమోషనల్ గాను సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందని.. ఇటీవల కాలంలో ఇలాంటి కథ రాలేదంటూ వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుందని.. ఆ ట్విస్ట్‌కు సినిమా చూసే ఆడియన్స్‌ కనెక్ట్ అవడం ఖాయం.

పూనకాలు తెప్పించేలా ఆ సన్నివేశాలు ఉండనున్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు కాసులసునామి కాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి.. దుబాయ్ ప్రీమియర్ షో నుంచి వచ్చిన టాక్‌తోనే ఇక్కడ ఆడియన్స్ ని కూడా సినిమా మెప్పిస్తుందా.. లేదా తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా థియేటర్ కల్ బిజినెస్ దాదాపు రూ.40 కోట్లు జరగగా నెల్లూరు, సీడెడ్‌ మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో సొంతంగానే సినిమాలు రిలీజ్ చేయనున్నారు. ఓవర్సీస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే రెండు మిలియన్ డాలర్లకు గ్రాస్ కొల్ల‌గొట్టాలి. నార్త్ అమెరికా నుంచి 12 మిలియన్ డాలర్లు రాబట్టాలి. ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం లక్ష డాలర్లు మాత్రమే జరగడం.. మేకర్స్‌కు కాస్త టెన్షన్ తెప్పిస్తున్నా.. సినిమా పాజిటివ్ టాక్ వస్తే రూ.3 లక్షల డాలర్ల వరకు కలెక్షన్లు సులువుగా వచ్చేస్తాయి.. ఇక ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం రూ.10 కోట్లకు పైగా షేర్ వసూళ్లు కొల్లగొట్టే అవకాశం ఉందని స‌మాచారం.