టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక పర్సనల్‌గా ఈ రెండు కుటుంబాల మధ్యన ఎప్పటినుంచ మంచి అటాచ్మెంట్ ఉంది. బాలయ్య, మోహన్ బాబు ఒకే జనరేషన్ కు చెందిన హీరోలు కావడంతో వీళ కుటుంబాల పరంగా కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న క్రమంలో.. ఒకప్పుడు ఇద్దరి ఇల్లు కూడా ఒక్క దగ్గరలోనే ఉండేవట. దీంతో క్లోజ్ గా ఉండే ఈ రెండు కుటుంబాలలో జరిగిన ఓ సంఘటన కారణంగా బాలయ్య భార్య వసుంధర.. మంచు మనోజ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. దానికి కారణం నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అని టాక్ నడుస్తుంది.
ఇంతకీ బ్రాహ్మణికి.. ఈ గొడవకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. నారా బ్రాహ్మణి పై కోపంతో మనోజ్ చేయి చేసుకోవడమేనని తెలుస్తుంది. అసలు.. మనోజ్‌కు అంత కోపం ఎందుకు వచ్చింది.. వసుంధర స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేంతలా ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ హోస్ట్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలా.. గతంలో బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టైంలో మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న, మంచి విష్ణువులు స్పెషల్ గెస్ట్లుగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా వారు తమ పాత జ్ఞాపకాల అన్నింటిని గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా మనోజ్.. బ్రాహ్మణికి చిన్నతనంలో గొడవ అయింది అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు.
అయితే బ్రాహ్మణీ.. మనోజ్‌ని తరచూ ఏడిపించేదని.. దీంతో ఓసారి కోపానికి వచ్చిన మనోజ్, బ్రాహ్మణిని కొట్టేసాడంటూ వాళ్లు గుర్తు చేసుకున్నారు. అయితే బ్రాహ్మణి వెంటనే విషయాన్ని బాలయ్య భార్య వసుంధర దగ్గరకు తీసుకువెళ్లిందట. దీంతో ఆమె వెంటనే మనోజ్ దగ్గరకు వెళ్లి.. మందలించారంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. మరోసారి వీరు నవ్వుకున్నారు. అంతేకాదు.. మోహన్ బాబుకు ఓ సినిమా షూట్ టైంలో పెద్ద ప్రమాదం జరిగి బాగా గాయపడ్డారని.. ఆ టైంలో బాలయ్య తమకు అండగా నిలిచి ఏడుస్తున్న మమ్మల్ని ఓదాచారని మంచు విష్ణు ఈ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇక అప్పట్లో గుర్తు చేసుకున్న ఈ స్వీట్ మెమోరీస్.. మరోసారి నెటింట వైరల్ గా మారుతున్నాయి.