‘ విడముయర్చి ‘ ట్విట్టర్ రివ్యూ.. అజిత్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తాజా మూవీ విడముయ‌ర్చి. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఏ సినిమా.. నేడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ‌ రిలీజ్ అయింది. రిలీజ్‌కు ముందే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను చూడనున్నామ‌నే ఫీల్ ఆడియ‌న్స్‌లో క‌లిగింది. ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సింది. కానీ.. అనివార్య కారణాలతో సినిమాను పోస్ట్‌పోన్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది. అజిత్ కు ఉన్న క్రేజ్ రీత్యా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బుకింగ్స్ జరిగాయి. కేవలం ఒక్క తమిళ్లోనే ఈ సినిమాకు రూ.17 కోట్ల గ్రాస్ వ‌సుళ్ళు వచ్చాయంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే కొద్ది గంటల క్రితం ముగిసిన విడ‌ముయ‌ర్చి ప్రీమియర్ షో టాక్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది.

WorstProductionHouseLyca Trends On X As 'Thala' Ajith Anxiously Wait For Update On Vidaamuyarchi | Republic World

అజిత్ లాంటి స్టార్ హీరో నుంచి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి కొన్ని డిమాండ్లు ఉంటాయి. సినిమాటిక్ లిబర్టీ, అభిమానుల కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ను దర్శకులు జత చేయాల్సి ఉంటుంది. కానీ.. అలాంటివేమి ఈ మూఈలో లేవ‌ని.. కేవలం స్టోరీ ఆధారంగా తీసుకుని స్క్రీన్ ప్లే నడిచిందని.. ఎక్కడ హంగులు, ఆర్భాటాలు లేకుండా ఫస్ట్ ఆఫ్ సాగిపోయిందని టాక్ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీద ఒక్క ఫైట్, సాంగ్, భారీ ఎలివేషన్స్ ఏవీ లేకపోవడం.. సినిమా స్క్రీన్‌ప్లే కూడా కాస్త ఎంగేజింగ్‌గా చూపించడం.. ఆడియన్స్‌ను నిరాశపరిచిన సెకండ్ హాఫ్‌లో మాత్రం.. యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌కు గూస్ బంప్స్‌ తెప్పించేలా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే థియేటర్లో ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ కు తీసుకువచ్చేలా ఫీల్ కల్పించాయ‌ని చెబుతున్నారు.

యాక్షన్ సీన్స్ అదిరాయి.. ఫస్ట్ అఫ్ నీరాశ‌ ఫీలయ్యే అభిమానులకు సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు బూస్టప్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఫైట్ సీన్స్ హీరోని ఎలివేట్ చేసేలా లేవు.. కానీ స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి ఉన్నట్లు అనిపించిందని.. సందర్భానుసారంగా అలా కథ సాగిపోయింది అంటూ చెబుతున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని కూడా.. మిస్ కాకుండా డైరెక్టర్ బ్యాలెన్స్ చేశాడని.. ఓవరాల్గా యాక్షన్ మూవీ లవర్స్ కి సినిమా విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్‌గా మారిందట. అంతేకాదు చాలా కాలం నుంచి తమిళ్ ఆడియన్స్‌కు ఒక్క పెద్ద హీరో సినిమా కూడా రాలేదు. ఈ క్రమంలో ఖచ్చితంగా విడముయ‌ర్చి భారీ వసూలు రాబట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.