నిన్న మొన్నటి వరకు మెగా, అల్లు ఫ్యామిలీల మధ్యన కోల్డ్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ మంటలు చల్లారుతున్నాయి అనుకునే సమయానికి.. మళ్లీ రెండు కుటుంబాల మధ్య వార్ ముదురుతుంది అనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చరణ్‌లో లేనిది అల్లు అర్జున్‌లో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీ ఇదే అంటూ.. అందుకే బన్నీ ఐకాన్ స్టార్‌గా మారాడంటూ ఓపెన్ గా కామెంట్లు చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాతో భారీ ఫ్లాప్ ఎదుర్కొన్న చరణ్, పుష్ప 2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇద్దరినీ కంపేర్ చేస్తూ.. మెగా ఫ్యాన్స్ ను మరింత కోపానికి గురి చేస్తున్నారు.
ఇంతకీ బన్నీలో ఉన్న చరణ్‌లో లేని ఆ స్పెషల్ క్వాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. నిజానికి రామ్ చరణ్ చాలా భయస్తుడు అని.. పిరికిగా ఉంటాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాల విషయంలో రిస్క్ చేయడానికి.. సేఫ్‌గా ముందుకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బన్నీ అలా కాదని పుష్ప లాంటి వినూత్న కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించాడని.. ఇక పార్ట్ 2 కోసమైతే ఏకంగా లేడీ గెటప్ చేసే సాహసం చేశాడని.. రామ్ చరణ్‌కు అలాంటి ధైర్యం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
చరణ్ రంగస్థలం సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలనుకున్నారని.. కానీ రామ్ చరణ్ అంత డేర్ చేయలేకపోయాడు అంటూ ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇక పుష్ప సినిమా విషయంలో సుకుమార్ తడబడుతున్న బన్నీ ముందుకు తెగించి సినిమా చేద్దామని సపోర్ట్ చేశాడట. అలా.. అల్లు అర్జున్‌కు ఉన్న డేర్ చరణ్ కు లేదని.. అతను పిరికివాడని.. అందుకే ఆయన కెరీర్ ఇలా అయిపోయిందంటూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు జనం.