టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని నేషనల్ లెవెల్‌కు తీసుకువెళ్లిన మొట్టమొదటి సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీరనే అనడంలో అతిశయోక్తి లేదు. అప్పటివరకు వరుస బ్లాక్ బాస్టర్లు కొడుతూ ఇండస్ట్రీలో రాణిస్తున్న రాజమౌళి.. చిరు కొడుకుతో సినిమా చేస్తున్నాడు అన్న వార్త అప్పట్లో ఓ సంచలనం. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి.. ముగిసే వరకు కూడా ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక విడుదల తర్వాత కూడా ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉండడంతో.. ఓపెనింగ్స్ నుంచి.. క్లోజింగ్ కలెక్షన్ల వరకు అదే రేంజ్ లో వసూళ్లు వచ్చాయి. ఆ రోజుల్లోనే సినిమాకు రూ.75 కోట్లకు పైగా షేర్స్ వచ్చాయంటే ఏ రేంజ్ లో సినిమా సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.
50 రోజులు, వంద రోజులు సెంటర్స్ విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా.. కేవలం తెలుగు సినిమాగా మాత్రమే పరిమితం అయ్యింది. ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేసి ఉంటే సంచలనం సృష్టించేదంటూ ఎంతోమంది అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ టైంలో ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ మగధీర టైంలో నేను ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని ఇతర భాషల్లో డబ్బు చేయమని చాలా ఒత్తిడి చేశానని.. సినిమా ఇతర భాషల్లో సక్సెస్ అవుతుందని నమ్మండి అని బ్రతిమిలాడానని.. కారణం తెలియదు ఆయన నో చెప్పారు. నాకు చాలా బాధనిపించింది.
అప్పటి నుంచి నేను ఇకనుండి నా సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లోనే తీయాలని చాలా అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి మాట్లాడిన ఆ ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాని హిందీలో డబ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా టెలివిజన్ వర్షన్ కోసం డబ్బు చేసి సోనీ టీవీలో టెలికాస్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు నార్త్‌లో ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. చరణ్ కి మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక ప్రస్తుతం జక్కన్న ఆడియో వైరల్ గా మారడంతో రాజమౌళి చెప్పినట్లు అల్లు అరవింద్ చేసి ఉంటే అప్పట్లోనే ఈ సినిమా రూ.300 కోట్ల వరకు గ్రాస్ వసూలు కొల్లగొట్టి ఉండేది.. బంగారం లాంటి ఛాన్స్ అరవింద్ మిస్ చేశాడంటూ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ పై ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్.