టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తారక్ తన సినిమాల పనుల్లో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో తెరకెక్కి సూపర్ సక్సెస్ అందుకున్న వార్ సీక్వెల్ వార్ 2లో తారక్, హృతిక్ రోషన్‌కు ప్రత్యర్థి పాత్రలో కనిపించనున్నాడు. వీరి మధ్య జరిగే యాక్షన్ సీన్స్ అకట్టుకోనున్నాయట. ఇప్పటికే సినిమాపై యూనిట్ హైప్‌ను పెంచెందుకు రకరకాలుగా సన్నాహాలు చేస్తున్నారు.
ఇంకొక ఫారెన్స్ షెడ్యూల్‌తో ఈ షూట్ ముగియనుందట. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మరో భారీ ప్రాజెక్టులో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ 31 రన్నింగ్ టైటిల్‌తో రూపొందునున్న ఈ మూవీ పిరియాడికల్ డ్రామా కావడం.. ఇప్పటికే కాస్ట్ అండ్ క్రూను కూడా నీల్ ఫిక్స్ చేసేసారని.. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది అంటూ టక్ నడుస్తోంది. ఇక వార్ 2 షెడ్యూల్ ముగియగానే ఎన్టీఆర్ 31 సెట్స్‌పైకి రానుంది. ఈ క్రమంలోనే సినిమా కాస్టింగ్ పై ఆసక్తి నెలకొంది. ఎస్ఎస్. రాజమౌళిలా సెన్సేషనల్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్‌కు కూడా మంచి ఇమేజ్ ఉంది. ఈ నేపధ్యంలో సినిమాలతో హీరోలకు దీటుగా విలన్స్‌ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 31లో క్యాస్టింగ్ స్ట్రాంగ్‌గా సెట్ చేశారని సమాచారం. ఇందులో మలయాళ స్టార్ హీరో టోవిన్ థామస్, బీజు మీనన్ పేర్లు వైరల్ గా మారుతున్నాయి. ఇక వీళ్లకు మలయాళ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ ఉంది. సీనియర్ నటుడు బీజుతో పాటు ప్రముఖ యాక్టర్ టోవినో థామస్ మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్‌గా దూసుకుపోతున్నారు. ఇక తెలుగులో మారీ2, 2018 ఇలాంటి సినిమాలు నటించే ఆకట్టుకున్న టోవిన్.. ఎన్టీఆర్‌తో బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై భారీ స్కేల్లో రూపొందించనున్నారు. రుక్మిణి వాసంత్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రవి బసృర్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు.