తాజాగా జరిగిన తండేల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్.. దిల్ రాజును ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ నెటింట పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ట్రోల్స్‌కు కూడా గురయ్యారు. దిల్ రాజును ఉద్దేశ్యస్తూ ఈ సంక్రాంతికి.. ఓ సినిమాతో అలా.. మరో సినిమాతో ఇలా అంటూ చేతిని కిందికి, పైకి ఊపుతూ తర్వాత ఐటీ అధికారులకు వెల్కమ్ చెప్పి సంచలనం సృష్టించాడు దిల్ రాజు అంటూ.. అల్లు అరవింద్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏ రెండు సినిమాలను ఉద్దేశించి అలా కామెంట్ చేసాడో అందరికీ అర్థమైంది. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిందని ఇన్ డైరెక్ట్ గా అలాంటి కామెంట్స్ చేశాడని.. దీనిపై సోషల్ మీడియాలో మెగా అభిమానులు.. అరవింద్‌ను ట్రిగ్గర్ చేస్తూ సొంత చెల్లెలు కొడుకు సినిమా ఫ్లాప్ అయితే.. మేనమామకు ఎందుకు ఇంత సంతోషం అంటూ ఫైర్ అయ్యారు.
దీనిపై అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యాడు. అయితే అభిమానులకు తన తప్పు లేదన్నట్లుగా చెప్తాడు అని అంతా భావించారు. కానీ.. ఆయన రియాక్షన్ మెగా ఫ్యాన్స్‌ను మరింత కోపానికి గురి చేసింది. తండేల్ రిలీజ్‌కు కొద్ది గంటల ముందు ప్రెస్మీట్ ఏర్పాటు చేసిన అల్లు అరవింద్.. రిపోర్టర్ ప్రశ్నకు దీనిపై రియాక్ట్ అయ్యాడు. మొన్న ఒక ఈవెంట్ లో మీరు కాస్త నోరు తూలినట్లు ఉన్నారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చే జరుగుతుంది.. వాటిని మీరు గమనించరా అని అడగగానే.. అల్లు అరవింద్ రియాక్ట్ అవుతూ.. హ గమనించా అన్నాడు. మరి మీరు ఆ వ్యాఖ్యలను కావాలని ఉద్దేశించి మాట్లాడినవా.. లేదా యాదృచ్ఛికంగా జరిగిందా.. అని అల్లు అడగగా.. అరవింద్ సమాధానం చెబుతూ.. నో కామెంట్స్ అని రియాక్ట్ అయ్యాడు. దీంతో మెగా ఫాన్స్ కు మరింత మండిపోతుంది.
అసలు నో కామెంట్స్ అర్థమేంటి.. అభిమానులు ఎలా తీసుకోవాలి..? అసలైన ఉద్దేశం ఏంటి..? మీరు ఏమైనా అనుకోండి ఐ డోంట్ కేర్ అని ఆటిట్యూడ్ తో అలాంటి కామెంట్స్ చేశారా..? అంటూ మండిపడుతున్నారు. ఒకప్పటి అల్లు అరవింద్ వేరు.. ఇప్పుడు వేరు అప్పట్లో అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటే.. సందర్భాన్ని బట్టి వివరణ ఇచ్చి సర్ది చెప్పేవారు. కానీ.. ఇప్పుడు ఆయన అసలు అలాంటి ఆలోచనలోనే లేడు. కచ్చితంగా మెగా అల్లు కుటుంబాలు మధ్య పెద్ద వివాదమే జరిగిందని అర్థమవుతుంది. గడచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చిరు, చరణ్‌లపై అల్లు అరవింద్ ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రకటించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న వెంటనే హుటాహుటిన బయలుదేరి ఇంటికి చేరుకున్న ఏకైక వ్యక్తి మెగాస్టార్ మాత్రమే. సురేఖ అయితే రాత్రంతా అల్లు అర్జున్ గురించి బెంగపెట్టుకుని తన ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే ఉంది. అయినా అల్లు అరవింద్ నుంచి ఇలాంటి రియాక్షన్ రావడం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.