సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది సెలబ్రిటీలు మాత్రమే ముక్కుసూటిగా మాట్లాడతారు, కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తుంటారు. అలాంటి వారిలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఒకటి. తాను ఏది అనుకుంటే అది క్లియర్‌గా చెప్పేసే ఆయన.. ఎలాంటి విషయాన్ని అయినా మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు. ఇటీవల సినిమాల నెగటివ్ రివ్యూ, కామెంట్‌లపై కూడా ఆయన రియాక్ట్ అయిన తీరు అందర్నీ మెప్పించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. అందరిని ఆలోచింపచేసేలా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా.. స్టార్ యూట్యూబర్ నిఖిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి థమన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వైవాహిక వ్యవస్థ పై నేటి జనరేషన్ ఆలోచనలపై ఆయన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏ ఒక్కరు పెళ్లి చేసుకోకూడదని.. నా అభిప్రాయం. ఇద్దరూ కలిసి జీవించే విషయంలో మ్యారేజ్‌తో చాలా కష్టతరమవుతుంది. లైఫ్ లో అమ్మాయిలు ఇండిపెండెంట్గా బతకాలనుకుంటున్నారు. వాళ్లకు ఒకరు కింద జీవించాలని ఉండట్లేదు. ప్రస్తుతం వివాహ వ్యవస్థ పై మెల్లమెల్లగా నమ్మకం కోల్పోతున్నాం. అందరు ఇండిపెండెంట్గా జీవించాలని కోరుకుంటున్నారు అంటూ థమన్ చెప్పుకొచ్చాడు. కోవిడ్ తర్వాత ప్రజల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందని.. ఎన్నో ఊహించని పరిణామాలు, మార్పులు చోటుచేసుకున్నాయంటూ చెప్పుకొచ్చిన ఆయన.. మానవ సంబంధాలు దెబ్బ తినడానికి ప్రధాన కారణంగా instagram అని నేను భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు.
నేను చెప్పిన మాటలు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఏదైనా అర్థం కాకపోవచ్చు.. కానీ అదే నిజమంటూ కామెంట్ చేశారు. సోషల్ మీడియా వల్ల ఎన్నో చెడు పరిణామాలు వ్యక్తమవుతున్నాయనేలా ఆయన చెప్పుకొచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ లో కేవలం బ్యూటిఫుల్ థింగ్స్ మాత్రమే షేర్ చేస్తున్నాం. మన జీవితంలో జరుగుతున్న ఎన్నో విషయాలు పంచుకుంటున్నాం. ఒక పాజిటివ్ రీల్ చేయడానికి మనం పడే స్ట్రగుల్స్ ఎవరికి తెలియవు. కేవలం పాజిటివ్ వేలో మాత్రమే అంతా చూడాలని ప్రయత్నిస్తున్నాం.
ఇలాంటి పరిస్థితులో నేను మ్యారేజ్ చేసుకోవడాని రికమెండ్ చేయనంటూ థమన్ చెప్పుకొచ్చాడు. మ్యారేజ్ లైఫ్ లోను ఇతరులను అర్థం చేసుకోవడానికి ఎవరు ప్రయత్నించడం లేదు అందుకే ఆ వ్యవస్థ చాలా టఫ్ గా మారిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చాలా విషయాలను నేను గ్రహించిన తర్వాత చూసిన తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే వద్దనే నేను చెప్తా ఎందుకంటే నేను చాలామందిని ఇటీవల కాలంలో చూస్తున్న.. పెళ్లైన కొద్ది రోజులకే డివర్స్ తీసేసుకుంటున్నారు. వివాహం జరిగిన ఐదు ఆరు నెలలకు విడిపోతున్నవారు ఉన్నారు. అలాంటివి వింటుంటే బాధగా అనిపిస్తుంది. దాంపత్య జీవితంలోని మంచి లక్షణాలను అర్థం చేసుకునే అవగాహన ఈ జనరేషన్ వారిలో లోపిస్తుందంటూ థమన్ చెప్పుకొచ్చాడు.