రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలయ్యకు ఉన్న క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పరిచయాల అవసరం లేదు. ఈ వయసులోనూ ఆయన యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఆల్ టైం రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాడు. ముఖ్యంగా అఖండ నుంచి సక్సెస్ ట్రాక్ లోకి అడుగుపెట్టి సరికొత్త వర్షన్ బాలయ్యను చూపిస్తూ.. యూత్, మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. బాలయ్య సినిమాలకు వస్తున్న కలెక్షన్లు దీనికి సరైన ఉదాహరణ అనడంలో సందేహం లేదు. అయితే.. బాలయ్య క్రేజ్ కేవలం టాలీవుడ్ లోనే కాదు.. ఇతర ఇండస్ట్రీలోనూ కనిపిస్తుంది. ఆయన సినిమాలను నార్త్ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు అనడానికి మహా కుంభమేళలో ఇటీవల కనపడిన ఒక దృశ్యమే ఉదాహరణ.
ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతున్న క్రమంలో దేశం నలుమూలల నుంచి భక్తులు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తు పునీతులు అవుతున్నారు. వివిధ ప్రైవేట్ బస్సులు, కార్‌లు, ట్రైన్లు ఇలా రకరకాల వాహనాలతో కోట్లాదిమంది ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. అలా.. వెస్ట్ బెంగాల్ నుంచి కొంతమంది భక్తులు స్పెషల్ వాహనాలు వేయించుకొని మరి కుంభమేళకు వచ్చారు. ఆ బస్సు మొత్తాన్ని బాలయ్య పెయింటింగ్ లతో నింపేశారు. ప్రస్తుతం ఈ బస్‌కు సంబంధించిన ఫొటోస్ వైరల్‌గా మారుతూ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. బలయ్యకు నార్త్ లోను హీరోయిన్స్ వీరాభిమానులు ఉన్నారని అంతా ఆశ్చర్యపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. ఇలాంటి పీక్స్ లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడా చూడలేదనేంతలా వెస్ట్ బెంగాల్ ఆడియన్స్ ఇలాంటి అభిమానం చూపించారంటూ.. బాలయ్యకు అక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో తెలుసుకోవచ్చు. బాలయ్య ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి పాన్ ఇండియన్ సినిమాల్లో నటించలేదు.
ఆయన నటించిన అఖండ సినిమా రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ.. పబ్లిసిటీ చేయకపోవడంతో సరిగ్గా సక్సెస్ అందుకోలేదు. కానీ.. ఇదే అఖండ హాట్ స్టార్‌లో అప్లోడ్ చేసినప్పుడు.. హిందీ వర్షన్ ఆడియన్స్ ఎగబడి మరీ చూశారట. బాలయ్య మాస్ విశ్వరూపానికి వెళ్ళు ఆశ్చర్య పోయారట. కేవలం ఓటీటీనే కాదు.. టీవీ టెలికాస్ట్ లోను ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఆ రేంజ్‌లో రీచ్ వచ్చింది. కాబట్టి.. బాలయ్యకి వెస్ట్ బెంగాల్‌లో అంతటి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమాతో పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. సినిమా షూటింగ్ సరవేగంగా సాగుతుండగా.. సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకు సినిమా రానుంది. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా తాండవం చూపిస్తారో లేదో వేచి చూడాలి.