తండేల్‌ను నిలబెట్టింది చైతు కాదా.. అతను లేకుంటే రిజల్ట్ వేరేలా ఉండేదా..?

తాజాగా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్‌ మూవీ ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా రూపొందిన ఈ సినిమాలో.. అల్లు అర్జున్ మత్స్యకారుడి పాత్రలో కనిపించగా.. అతను ప్రేమించిన అమ్మాయిగా సాయి పల్లవి నటించి మెపించింది. గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట.. అనూహ్యంగా ఏడబాటుకు గురవాల్సి వస్తుంది. ఇక ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలిశారు అన్నదే తండేల్‌ స్టోరీ. ఇక ఈ కథలో దేశభక్తిని జోడించి డైరెక్టర్ చందు మొండేటి సినిమాను రూపొందించారు. ఇక సినిమా అద్భుతంగా ఉందని ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి.

చైతు, సాయి పల్లవి పోటీపడి నటించారని.. తమ ఎమోషన్స్ బాగా పండించారని.. సాయి పల్లవి న‌ట‌న‌ను డామినేట్ చేస్తూ నాగచైతన్య ఆకట్టుకున్నారని.. అక్కడక్కడ సినిమా కాస్త స్లో అనిపించినా.. చివరి 20 నిమిషాల క్లైమాక్స్ తో డైరెక్టర్ ఫిదా చేసేసాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇదంతా ఒక ఎత్తు, డిఎస్పి ఇచ్చిన సంగీతం మరో ఎత్తు అంటూ.. తండేలు మూవీకి డిఎస్పి మ్యూజిక్‌ బ్యాక్ బోన్‌గా నిలిచిందంటూ టాక్‌. ఇటీవల కాలంలో డిఎస్పీ ఇచ్చిన బెస్ట్ సినిమా ఇదే అని.. పుష్ప 2ను మించి పోయే రేంజ్‌లో దీని మ్యూజిక్ ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా ముందు వరకు కూడా దేవిశ్రీపై ఎన్నో విమర్శలు వచ్చాయి.

Next Songs From Thandel Will Be Equally Amazing: DSP | Next Songs From  Thandel Will Be Equally Amazing: DSP

సినిమాకు అసలు డిఎస్పిని ఎందుకు తీసుకున్నారంటూ కామెంట్లు కూడా వినిపించాయి. అలాంటిది ప్రేమ కథకు డిఎస్పి ఇచ్చే మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుందన్నటంలో సందేహం లేదు. ఇలాంటి క్రమంలో డిఎస్పి మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ ను క్రియేట్ చేశాడు. తండేల్‌ సినిమాకు ఆయన అసలైన హీరో. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కథలో లీనమయ్యేలా చేయడంలో డిఎస్పీ నే కీరోల్‌ ప్లే చేశాడు అంటూ.. సెకండ్ హాఫ్ లో తనదైన మ్యూజిక్ ఆకట్టుకుందని.. సినిమా హిట్ వెనక డిఎస్పి కృషి ఎక్కువగా కనిపిస్తుంది అనడంలో అనుమానం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ విధంగా డిఎస్పి లేకపోతే ఈ సినిమా అసలు క్లిక్ అయ్యేదే కాదంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.