సమంతతో డివోర్స్, శోభితతో మ్యారేజ్‌పై నాగ చైతన్య షాకింగ్ రియాక్ష‌న్‌.. ఇకనైనా మారండి అంటూ ఫైర్‌..!

టాలీవుడ్ హీరో నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత.. మొదటిసారి నాగచైతన్య విడాకులపై రియాక్ట్ అయ్యారు. వారి వివాహ బంధం నుంచి విడిపోయిన తర్వాత ఎన్నోసార్లు సమంత రియాక్ట్ అయినా.. చైతు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. విడాకులు తీసుకుని నాలుగేళ్లు అవుతున్న ఆయన రియాక్ట్ కాలేదు. అలాంటి నాగచైతన్య మొదటిసారి విడాకుల గురించి మాట్లాడుతూ తనతో విడిపోయిన తర్వాత ఎన్నో నెగటివ్ కామెంట్లు వచ్చాయని.. కానీ నేను వాటిపై రియాక్ట్ కాలేదు. తను నేను ఇద్దరం ఎంతగానో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకున్నాం.. అయినా చాలా మంది నెగటివ్ కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు ఈ క్రమంలోనే శోభితతో మ్యారేజ్ పై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు.

సమంతతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ షేర్ చేసిన దానికి నెగటివిటీనే వచ్చేది. ఇప్పటికీ అది కొనసాగుతుంది. వాటిని నేను చదువుతా. సమంతతో విడిపోయిన తర్వాత ఇద్దరం కలిసే విడాకులు తీసుకున్న విషయాన్ని ప్రపంచంతో చెప్పాం. వ్యక్తిగత కారణాలతో వేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించాం.. ఎవరి దారిలో వారు జర్నీ కొనసాగుతుందని.. వ్యక్తిగత లైఫ్‌కి ప్రైవసీ ఇవ్వండి అంటూ అభ్యర్థనలు చేశాం. అయితే మా విడాకులు ఇతరులకు ఎంటర్టైన్మెంట్‌గా మారాయి. ఎన్నో పుకార్లు వినిపించాయి. అలాంటి టైం లో మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.. ఆ ఇంటర్వ్యూ కూడా నెగటివ్ చేసేసి ప్రచారం చేస్తారు. అందుకే రియాక్ట్ కాలేదు. కానీ.. కొన్ని సందర్భాల్లో పలు వేదికలపై ఈ విషయం గురించి అడిగారు.

ఆ టైంలో కూడా నేను టాపిక్ గురించి వదిలేయమని రిక్వెస్ట్ చేశా. అయినా అదే విషయంపై ప్రశ్నలు అడుగుతూ మళ్లీ.. మళ్లీ.. గాయాన్ని రేపుతున్నారు. కానీ.. మా నిర్ణయాన్ని ఎవరు గౌరవించడం లేదు. విడాకులు వార్తలు, కామెంట్లు గురించి ఇప్పటికీ ఫుల్ స్టాప్ పడడం లేదు. అలాంటి వార్తలు రాసేవారు ఇకపై అయినా ఆపేయండి. నా పై నెగిటివిటీ మానేసి మీ భవిష్యత్తు గురించి మంచిగా ఆలోచించుకోండి. విడాకులు అనేది నా లైఫ్ లోనే కాదు.. సమాజంలో ఎంతో మంది లైఫ్ లో ఉంది. నేను ఏమైనా క్రిమినల్ కాదు కదా. నేనొక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చా. 1000 సార్లు ఆలోచించే విడాకులు నిర్ణయం తీసుకున్నాం.

మా లైఫ్‌లో విడాకులు అనేది రాత్రికి రాత్రి జరిగిన నిర్ణయం కాదు. ఎన్నోసార్లు చర్చించిన తర్వాత ఇద్దరం కలిసి నిర్ణయానికి వచ్చాం అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఇక శోభిత పెళ్లి విషయం గురించి ఆయన మాట్లాడుతూ తనతో పెళ్లి ప్రకటించిన తర్వాత కూడా నెగటివ్ గానే కామెంట్లు చేశారని.. ఆమె నా జీవితంలో చాలా నాచురల్ గా ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట instagram ద్వారా పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి మా ప్రేమ మొదలైంది. కానీ.. తన గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. నా లైఫ్ లో శోభిత నిజమైన హీరో అంటూ చైతు చెప్పుకొచ్చాడు.