తండేల్ మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. చందు మండేటి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో బన్నీవాస్, అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై ఆడియన్స్‌ దగ్గర పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే టికెట్ బుకింగ్ విషయంలోనూ జోరు చూపిస్తుంది. ఈ క్ర‌మంలో తండేల్ ఫస్టే డే కలెక్షన్స్ ఏ రేంజ్‌లో కొల్లగొట్టిందో ఒకసారి చూద్దాం. నేను మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

Thandel takes a highest opening for Naga Chaitanya

పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా రిలీజై.. తెలుగులో హైయెస్ట్ వసూళ్లు సాధించడం విశేషం. నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా తండేల్ రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు గతంలో తను నటించిన లవ్ స్టోరీ ఫస్ట్ డే సుమారు రూ.10 కోట్ల గ్రాస్‌ రాబట్టగా.. ఇప్పుడు ఆ రికార్డును తండేల్ బ్రేక్ చేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు వైరల్ చేస్తున్నారు. విదేశాల్లో మొదటి రోజు ఈ సినిమా రూ.3.7 కోట్లు రాబట్టిందని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

Thandel Makes Waves at the USA Box Office | Thandel Makes Waves at the USA  Box Office

ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ద్వారా రిలీజ్ చేసింది. అలలు మరింత బలపడుతున్నాయి అంటూ ఒక క్యాప్షన్ జోడించారు. విదేశాల్లో ఈ సినిమా లాంగ్ రన్‌లో సుమారు రూ.10 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బుక్ మై షో లో ఫస్ట్ డే 2.5 లక్షలకు పైగా తండేల్ టికెట్స్ అమ్ముడు పోగా.. ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రతి గంటకు పదివేల టికెట్లు సులువుగా అమ్ముడుపోతున్నాయి. రాజుగా చైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి జోడి ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా మ్యూజిక్ విజువల్స్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయని చెబుతున్నారు.