కన్నీటితో ఈ మెసేజ్ చేస్తున్నా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎమోషనల్..!

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్.ఎస్‌.థ‌మ‌న్ ప్రస్తుతం పుల్ ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఆయ‌న‌.. తాజాగా డాకు మహారాజ్‌లో తన మ్యూజిక్‌కు మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాతో మరోసారి స‌క్స‌స్‌ తన ఖాతాలో వేసుకున్న థ‌మ‌న్‌.. ప్రస్తుతం మరిన్ని భారీ ప్రాజెక్టులలో బిజీబిజీగా రాణిస్తున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వాళ్లకు మంచి ట్రీట్ ఇస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే థ‌మన్‌ తాజాగా ఓ ఎమోషనల్ ట్రీట్ షేర్ చేయడంతో అది క్ష‌ణాలో తెగ వైరల్ గా మారింది.

Young music director S.S.Thaman

ఇంతకీ థ‌మన్‌ అంతలా ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి.. అసలు ఆ ట్వీట్ లో ఏముందో ఒకసారి తెలుసుకుందాం. తాజాగా దివంగత నటుడు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకున్న ఆయ‌న నువ్వు మమ్మల్ని ఎలా వదిలేసావ్‌ అన్న.. మేము నిన్ను కోల్పోయాము. మా ప్రియమైన పునీత్ రాజ్ కుమార్ అన్న.. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హ్యూమన్ ఫ్రెండ్, బ్రదర్ ఫ‌ర్ మీ అన్న‌. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా.. నిన్ను కోల్పోవడానికి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఇక ఈ మెసేజ్ టైప్ చేస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయంటూ రాసుకోచ్చాడు. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తిస్తాడు. లవ్ యు అప్పు అన్నా. మీరు ఈ సమాజానికి, ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయి అంటూ ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకున్నాడు.

In pics: ​Puneeth Rajkumar's rapport with Telugu film celebrities | Times of India

ఇక కన్నడ పవర్ స్టార్ గానే కాకుండా తెలుగులోను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పునీత్ రాజ్ కుమార్.. తనకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడే బాల న‌టుడిగా కిరీర్‌ను ప్రారంభించారు. అంతేకాదు.. చిన్న వయసులోనే 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడుగా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్న ఈయన.. 2022లో అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 45 ఏళ్ల సినీ కెరీర్‌లో 32 సినిమాల్లో నటించిన ఆయన.. పర్సనల్ లైఫ్ లోను సహాయం కోరిన వారికి లేదనకుండా అండగా నిలిచి సమాజంలో రియల్ హీరోగాను మారారు. లక్షలాది మంది హృదయాల్లో చెర‌గని ముద్ర వేసుకున్నారు. 46 సంవత్సరాల అతి చిన్న వయసులోనే మృతి చెందడం సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది.