తండేల్ లాంటి బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో క‌థ‌ను మొద‌ట ఓ హీరో కోసం అనుకుని త‌ర్వాత‌.. ఏవో కార‌ణాల‌తో మరో హీరోని తీసుకోవ‌డం ఆ హీరోతోనే సినిమా చేయడం చాలా కామన్. ఇది ఇండ‌స్ట్రీలో ఎన్నో స్టోరీల విష‌యంలో జ‌రిగింది కూడా. అయితే ఆ సినిమా రిజల్ట్‌ బట్టి.. మొదట అనుకున్నా ఆ హీరో ఎమోషన్స్ ఉంటాయి. ఆ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో.. తర్వాత అదే కథ‌ బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. అనవసరంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసామని బాధపడుతూ ఉంటారు. అదే సినిమా ఫ్లాప్ అయితే.. రిజెక్ట్ చేసి మంచి పని చేశామని ఫీల్ అవుతారు. అయితే.. తాజాగా ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన బ్లాక్ బ‌స్టర్ టాక్ తెచ్చుకున్న తండేల్‌ సినిమాను కూడా.. ఓ హీరో రిజెక్ట్ చేసినందుకు చాలా ఫీలవుతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇంతకీ తండేల్ లాంటి మంచి సినిమా రిజెక్ట్ చేసిన ఆ అన్ లక్కీ హీరో ఎవరో.. కార‌ణాలేంటో ఒకసారి తెలుసుకుందాం. అతను మరెవరు కాదో నేచురల్ స్టార్ నాని. తండేల్‌ సినిమాకు మొదట చందు మొండేటి.. హీరోగా నాని అయితే పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావించారట. ఎందుకంటే నాని నాచురల్ గా తన నటనతో ఆకట్టుకుంటారు. రియల్‌గా జరిగిన కథలో ఆయన నేచురల్ పెర్ఫార్మన్స్ బాగుంటుందని నాని ని తీసుకుందామని ఆయనకు కథ వినిపించాడట. అయితే ఈ సినిమాల్లో డిగ్లామరస్ లుక్‌లో కనిపించాలి.. ఇక ఇప్పటికే నేను దసరా సినిమాలో డిగ్లామ‌ర్‌ లుక్‌లో మూవీ చేశా. మళ్లీ అదే లుక్ అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుందేమో.. వేరే ఎవరితోనైనా ఈ సినిమా చేయండి అని కథను సునితంగా రిజెక్ట్ చేసాడట.

Dasara (2023) - Movie | Reviews, Cast & Release Date in greater-noida- BookMyShow

దీంతో తర్వాత ఈ క‌థ‌ చాలామందికి వినిపించిన చందు.. చివరకు నాగచైతన్య దగ్గరకు తీసుకువెళ్లారు. ఇక కథ విని నాగచైతన్య చాలా ఎక్సైట్ అవ్వడమే కాదు.. ఇప్పటివరకు ఇలాంటి స్టోరీ నేను వినలేదు.. కచ్చితంగా ఈ సినిమా మనం చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆలా సెట్స్‌పైకి వచ్చిన తండేల్.. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ ట్రాక్ తెచ్చుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగానే దూసుకుపోతుంది. కాగా.. ఈ సినిమాను నాని రిజెక్ట్ చేశాడని న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారడంతో.. ఆయన ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నాని అన్న నటించి ఉంటే మరింత బాగుండేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.