తాజాగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో.. చరణ్ తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడట చరణ్. ఇక ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన్నతో చరణ్ తన నెక్స్ట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సి 16 రన్నింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూట్ సరవేగంగా జరుగుతుంది.
తాజాగా కొత్త స్కేడ్యూల్ ప్రారంభించిన మేకర్స్.. నైట్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమా షూట్ ను పూర్తి చేసి.. రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట టీం. బుచ్చిబాబు కూడా పక్కా ప్లానింగ్‌తో సినిమా తీస్తున్నాడని.. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయించేసినట్లు తెలుస్తోంది. ఇక చరణ్ రెండు రోజుల క్రితం తన కూతురు క్లింకారతో కలిసి ఆర్‌సి16 సెట్స్ లో సందడి చేసిన పిక్స్ నెట్ వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా ప్రస్తుత ఈ సినిమా షూట్ ఒక క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుండగా.. ఫ్లడ్ లైట్, నైట్ షూటింగ్, క్రికెట్ అంటూ హాష్ ట్యాగ్ తో ఈ మూవీ డివోపి రత్నవేలు షూటింగ్ ఫోటోలను పంచుకున్నాడు.
ఇక ఇప్పటికే సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రత్నవేలు చేసిన పోస్ట్‌తో దానిపై క్లారిటీ వచ్చేసింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లోనే సినిమా రాబోతుందని చెప్పకనే చెప్పేసాడు రత్నవేలు. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈసారి దసరా లేదా దీపావళి సీజన్లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. ఈ సినిమాల్లో చరణ్ క్యారెక్టర్ రంగస్థలం సినిమా చిట్టి బాబు క్యారెక్టర్ కంటే మరింత పవర్ఫుల్ గా ఆడియన్స్ లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని.. క్లైమాక్స్ ని కూడా అంతకుమించి అనే రేంజ్ లో డిజైన్ చేస్తున్నారని సమాచారం. దీంతో మెగా అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపుతున్నారు.