పక్కనోడి సినిమా తొక్కేసేందుకు కుట్రలు చేసే హీరోలు కూడా ఉన్నారు.. నాగ చైతన్య

నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తాజా మూవీ తండేల్.. శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చందు మొండేటి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాను.. గీత ఆర్ట్స్2 బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీవాస్ సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. రూ.80 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఎలాంటి కలెక్షన్లు కొల్లగొడుతుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్ని సందడి చేశారు. అలా.. ఇటీవల పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలోను పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య టాలీవుడ్ లో జరుగుతున్న నెగిటివ్ పబ్లిక్ సిటీ, పి ఆర్ టీమ్స్ హడావిడి, మెయిన్ పేజెస్ గురించి రియాక్ట్ అయ్యాడు.

టాలీవుడ్‌లో నెగటివ్ పిఆర్ సాగుతుందంటూ వెల్లడించాడు. హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. కావాలనే పిఆర్ టీమ్స్‌తో నెగటివ్ పోస్టులు చేయించడం, మీమ్స్‌ క్రియేట్ చేయించడం జరుగుతున్నాయని ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఈ నెగటివ్ పిఆర్‌కు తాను మాత్రం దూరంగా ఉంటానంటూ చెప్పుకొచ్చాడు. పక్కనోడి సినిమా తొక్కేసి.. ఎదగాలనుకునే హీరోలు కూడా ఉన్నారంటూ చైతన్య ఒప్పుకున్నాడు. ప్రతి హీరో పిఆర్ టీం కోసం ఖర్చు చేయడం కామన్. అది వాళ్ళ పబ్లిసిటీకి మాత్రమే ఉపయోగపడేలా ఉండాలి. అంతేగాని.. పక్కన వాడి సినిమాని తొక్కేశేల ఉండొద్దంటూ చెప్పుకొచ్చాడు.

నా వరకు నేను నా సినిమా రిలీజ్ అయినప్పుడు పిఆర్ కోసం ఖర్చు చేస్తా.. కొందరు హీరోలు నెగటివ్ పిఆర్ చేయించకుండా తమ పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తే బాగుంటుందేమో.. లేదంటే ఆ డబ్బుతో హ్యాపీగా వెకేషన్ కైనా వెళ్లొచ్చు. లేదా కనీసం యాక్టింగ్ అయినా నేర్చుకుని ఎదగొచ్చు అంటూ చైతు షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ పై చైతూ చేసిన ఈ కామెంట్స్ నెటింట దుమారం రేపుతున్నాయి. టాలీవుడ్ లో జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ గురించి చైతు కామెంట్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే నాగచైతన్య కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి.