ఇండియాలోనే కాస్ట్లీయస్ట్ విలన్ గా స్టార్ బ్యూటీ రెమ్యూనరేషన్ లో కల్కి యానిమల్ విలన్ల రేంజ్ దాటేసిందిగా..!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సరికొత్త ట్రెండ్‌ కొనసాగుతుంది. ఎంత పెద్ద స్టార్ డైరెక్ట‌ర్ అయినా హీరోల కంటే ఎక్కువగా విలన్లే ఎంపికపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. హీరోలకు దీటుగా విలన్లను ఎంచుకుంటూ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాత్ర నడివి కూడా అధికంగా ఉండేలా చూస్తూ రమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో అందిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విల‌న్ ఎవరంటే జగపతిబాబు, సంజయ్ దత్త్‌, బాబి డియోల్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ.. లేడి విల‌న్ అంటే మాత్రం ఎవరు సమాధానం చెప్పలేరు.

అయితే తాజాగా ఈ ముగ్గురు హీరోలని డామినేట్ చేసేలా.. ఓ హీరోయిన్ విలన్ గా మారి ఇండియన్ సినిమాలో హైయెస్ట్ రెమ్యున‌రేష‌న్‌ అందుకోనుంద‌ట‌. ఈ విలన్ అందర్నీ వెనక్కి నెట్టేసి.. తన డామినేషన్ తో మెప్పించనుందట. ఇంతకీ విల‌న్‌గా మారిన ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి చూద్దాం. సాధారణంగా చాలామంది కొంతకాలం వరకే ఇండస్ట్రీలో హీరోలుగా రాణించగలరు. తర్వాత విలన్ గా లేదా కీలక పాత్రలో నటిస్తూ కిరీర్‌ కొనసాగిస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ లేడీ విలన్ మాత్రం.. ఇప్పటికి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తిరుగులేని ముద్ర వేసుకుని మంచి ఫామ్ లో దూసుకుపోతుంది. ఇలాంటి క్రమంలో అమ్మడు విలన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ టాక్ నడుస్తుంది.

SSMB 29: Mahesh Babu and SS Rajamouli attend puja, is Priyanka Chopra Jonas  joining the cast? – India TVఆమె మరెవరో కాదు ప్రియాంక చోప్రా. స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి 1000కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందించ‌నున్న పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో ప్రియాంక కీలకపాత్రలో కనిపించనుంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాల్లో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని మొదట వార్తలు వినిపించినా.. ప్రస్తుతం ఈమె సినిమాలో విలన్ గా కనిపించబోతుందంటూ టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాకు రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్‌ చేసిందంటూ బీటౌన్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇదే నిజమైతే మాత్రం ఇప్పటివరకు ఇండియా సినిమాలోని హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్‌ల‌ అందరిని దాటేసి కాస్ట్లి విల‌న్‌గా ప్రియాంక మారినట్లే అవుతుంది.