భారతీయులు వైవాహిక వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ.. వైవాహిక సాంప్రదాయాలు, వ్యవహారాలకు జేజేలు కొట్టేవారు. కానీ.. ఇటీవల కాలంలో వైవాహిక వ్యవస్థకు బీటలు బారుతుంది. డివోర్స్ కల్చర్ మరింత స్పీడ్ అప్ అవుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విడాకుల వార్త వైరల్ అవుతూనే ఉంది. సాధారణ ప్రజల కంటే ఎక్కువగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా ఉండే సెలబ్రిటీల విడాకులు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఒకరినొకరు ప్రేమించుకుని.. డేటింగ్ చేసి ఇరు కుటుంబాలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నంత టైం కూడా వారు విడాకులకు పట్టడం లేదు. ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా సెలబ్రిటీల విడాకులు చాలా కామన్ అయిపోయాయి. అలా ఇప్పటికే టాలీవుడ్ లో నాగచైతన్య – సమంత, నిహారిక – చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
అంతేకాదు దాదాపు 29 ఏళ్ల వైవాహిక జీవితంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా తాజాగా భార్య సైరా భానుకి విడాకులు ఇచ్చినట్లు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. దాదాపు ఈ సెలబ్రిటీస్ అంత విడాకులు తీసుకుంటున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందు.. భార్య లేదా భర్త, లైఫ్ పార్టనర్ ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేసి వారిని అన్ ఫాలో చేస్తూ వచ్చారు. తర్వాత కొంతకాలానికి అఫీషియల్‌గా విడాకులు ఇచ్చేసి ఫాన్స్‌కు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారని.. త్వరలోనే ఈ షాకింగ్ న్యూస్ చెపబోతున్నారంటూ టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వైరల్ అయ్యే బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ఈ విషయాన్ని వెల్లడించాడు.
బీటౌన్‌లో స్టార్ కపుల్స్ త్వరలో విడాకులు తీసుకుపోతున్నట్లు పేర్కొన్నాడు. ఇక ఆయన చెబుతున్న ఈ జంటకు.. టాలీవుడ్‌తో పాటు.. దేశవ్యాప్తంగాను మంచి ఇమేజ్ ఉందని.. సదరు హీరోకు ఆల్రెడీ పెళై మొదటి భార్యతో విడాకుల తీసుకున్నాడని.. వాళ్లకు కొడుకు, కూతురు ఉండగా.. ఇద్దరు పెళ్ళిడుకు వచ్చినట్లు తెలుస్తోంది. కూతురు స్టార్ హీరోయిన్ కాగా, కొడుకు త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఇక మొదటి భార్యతో విడాకుల తర్వాత బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించి కొంతకాలం డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నాడు. ఇతని కోసం ఆమె తన పిక్స్ కెరీర్‌ని కూడా పక్కన పెట్టేసి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇక హీరోయిన్ ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. భర్త హిందీ తో పాటు సౌత్ లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలో ఉమైర్ సంధు.. వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన చెప్పిన ఈ జంట ఎవరో మీకు అర్ధమయ్యే ఉంటుంది.