అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ఆడియన్స్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమాలన్నీ ఎంచుకుంటూ ప్రేక్షకులు ఆకట్టుకున్న నాగచైతన్య.. ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత 100% లవ్, ఒక లైలా కోసం, ప్రేమమ్, మజిలీ, లవ్ స్టోరీ లాంటి ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ సినిమాలను నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు.
తాజాగా తండేల్‌తో మరోసారి ఆడియన్స్‌ను మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొనున్నాడు. ఇలా లవ్ స్టోరీస్‌తో యూత్ ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతున్న చైతు.. మధ్యలో కొన్ని మాస్ సినిమాలు నటించినా.. అవి పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే నాగచైతన్య నటించిన స్‌మా సినిమాలో బెజవాడ సినిమా అయుతే శోభితకు అస్సలు నచ్చదట. ఈ సినిమా ఇప్పుడు చూసిన ఆమె చైతూని తిడుతూనే ఉంటుందట.
ఇక శోభితకు.. నాగచైతన్య నటించిన ఏమాయ చేసావే సినిమా ఫేవరెట్ మూవీ అని తెలుస్తుంది. ఈ సినిమాను ఆమె ఎన్నోసార్లు చూసిందట. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య తండేల్ మూవీ ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు. ఇక గతంలో సమంత, నాగచైతన్య దగ్గర అవడానికి.. వారిద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకోవడానికి కారణం కూడా ఏమాయ చేసావే సినిమానే అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సినిమా శోభిత ఫేవరెట్ మూవీ అని తెలియడంతో ఆడియన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.