అఖండ 2 తాండవంకి విలన్ గా ఆ స్టార్ యాక్టర్.. ఇది అసలు సిసలు బ్లాక్ బస్టర్ కాంబో..!

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందనున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ అఖండ 2 తాండవం. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో కోలాబరేట్ అయింది. వీరిద్దరి కాంబోలో వచ్చి గతంలో బ్లాక్ బస్టర్ అందుకున్న అఖండ సీక్వెల్‌గా.. అంతకుమించేలా అఖండ 2 తాండవంను యాక్షన్ ఇన్ టెన్స్ వేరే లెవెల్‌లో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. 14 రిల్స్‌ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ రివీల్‌ చేశారు.

Akhanda 2 - Thaandavam': Nandamuri Balakrishna's next with Boyapati Sreenu  launched - The Hindu

ఈ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఆది పిన్నిశెట్టి తన కెరీర్‌లోనే ఎక్సైటింగ్ చాప్టర్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని మేకర్స్ వెల్లడించారు. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన సరైనోడు సినిమాలో ఆది విలన్ పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరోసారి ఫెరోషియస్‌గా తన కెరియర్‌లో మోస్ట్ ఇంపాక్ట్ పాత్రలో ఒకటిగా అఖండ సినిమాలోని పాత్రను డిజైన్ చేశారని.. ఈ మూవీలో అతనికి కొత్త లుక్ ఆడియన్స్ను ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. ఇక బాలయ్య, ఆది మధ్య జరిగే సన్నివేశాలు అభిమానులకు ఇంటెన్ ప్రిక్షన్ థ్రిల్లింగ్ విజువల్స్ లిస్ట్ అందించబోతున్నాయని సమాచారం. ఇక ప్రస్తుతం సినిమా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ఆర్ట్స్‌ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ నిర్మించిన గ్రాండ్ సైట్లో షూట్ జరగనుంది.

Aadhi Pinishetty joins the cast of 'Akhanda 2: Thandavam' | Telugu Cinema

ఈ సెట్స్‌లో ప్రస్తుతం బ్రీత్‌ టేకింగ్ యాక్షన్ సీక్వెన్స్ రూపొందుతున్నట్లు సమాచారం. ఇక ఈ ఫైట్ సీక్వెన్స్‌ల‌కు రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ డైరెక్ట్ చేస్తున్నారు. బాలయ్యతో పాటు.. ఆది పినిశెట్టి ఈ యాక్షన్ ఫ్యాక్టరీ షూట్లో పాల్గొననున్నారని టాక్. వారి పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌కు తీసుకెళ్లనుందని.. అంత బలంగా బోయపాటి సన్నివేశాలను రాసారని.. సినిమాల్లో మెయిన్ హైలెట్‌లలో ఈ సన్నివేశం ఒకటిగా నిలవబోతుందని.. యూనిట్ నుంచి టాక్ నడుస్తుంది. ఇక సంయుక్త మీన‌న్‌ హీరోయిన్గా రూపొందిన ఈ సినిమాకు.. ఎస్ఎస్. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 25, 2025 దసరా స్పెషల్‌గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.