సెకండ్ డే కలెక్షన్లతో హిస్టరీ క్రియేట్ చేసిన నాగచైతన్య .. ఆ ఏరియాలో తండేల్ రాజుల‌మ్మ జాత‌రే..!

అక్కినేని హీరో నాగ చైతన్య గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో నాగచైతన్య తండేల్‌ సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక టాక్‌కు తగ్గట్టుగానే చైతన్య కెరీర్‌లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్‌ను దక్కించుకున్నాడు. నిర్మాతలు అనౌన్స్‌ చేసిన లెక్కల ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రూ.21 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. కానీ.. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం రూ.18 కోట్ల గ్రస్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి నాగచైతన్య కెరీర్‌లో ది బెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే రెండవ రోజు కూడా సినిమాకు అదే రేంజ్‌లో వసూళ్లు వస్తున్నాయి.

బుక్ మై షోలో ఎక్కడ చూసినా హౌస్ ఫులే కనిపించాయి. నాగచైతన్య లాంటి హీరో సినిమా గంటకు 16,000 టికెట్లు అమ్మడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక సినిమా చూసిన‌ జనాల పాజిటివ్ టాక్‌తో.. ఎన్నో ప్రాంతాల్లో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రెండ‌వ రోజు తండేల్ కొల్లగొట్టింది. సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అక్కినేని హీరోతో పాటు.. అభిమానులకు కూడా మంచి కిక్ ఇచ్చింది. ఇక సినిమా రూ.40 కోట్ల రూపాయల ఫ్రీ థియెట్రికల్ బిజినెస్ చేసుకోగా.. మొదటి రోజు రూ.10 కోట్ల షేర్ వ‌సూళ్లు వచ్చాయి. తాజా అంచనాల ప్రకారం రెండో రోజు రూ.12 కోట్ల వరకు షేర్‌ కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే మూడో రోజు రెండో రోజు కంటే మరింత ఎక్కువ వాసుళ్లు రావచ్చని అంచనాలు వేస్తున్నారు. అలా మొదటి వీకెండ్ లో తండేల్‌కు దాదాపు రూ.32 కోట్లకు మేర షేర్ వసూలు వచ్చే అవకాశం ఉందట.

ఇక చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా లవ్ స్టోరీ నిలిచింది. అప్పట్లోనే సినిమాకు రూ.37 కోట్ల వసూలు రాగా.. ఇప్పుడు తండేల్‌ ఆ కలెక్షన్లను ఒక్క వారంలోనే పూర్తి చేయనుంది. ఫుల్ రన్ లో రూ.60 కోట్ల మేర షేర్ వసూలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలా నాగచైతన్య కెరీర్‌లోనే మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టే సినిమాగా తండేల్ నిలవనుందని టాక్. కేవలం సినిమాలో సాంగ్స్ కోసమైనా.. సినిమా హిట్ అవుతుందని అంతా భావించారు. కానీ.. ఈ రేంజ్‌లో సక్సెస్ అందుకోవడం అసలు ఊహించలేదు. ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.