టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ పాన్ వరల్డ్ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఎంటర్టైన్మెంట్‌ను ఇష్టపడే ప్రతి ఒక్క ఆడియన్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఇటు రాజమౌళి, అటు మహేష్ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ఎన్నో సినిమాలు నటించారు. కానీ.. మహేష్ బాబు ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో కూడా నటించకపోవడం ఫ్యాన్స్‌కు కాస్త నిరాశనిచ్చింది. ఇటీవల కాలంలో ప్రతి హీరో పాన్ ఇండియా లెవెల్ లో కొత్త తరహా కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. వాళ్లతో పోలిస్తే.. మహేష్ బాబు పాన్ ఇండియా లెవెల్‌లో వెనుకబడుతూ వస్తున్నాడు.
ఈ క్రమంలోనే రాజమౌళి చేయబోయే సినిమాతో మహేష్ ఇంతకాలం అభిమానులకు బాకీ పడ్డిన మొత్తం తీర్చతున్నాడని టాక్ నడుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్స్ జానర్‌లో జరిగే సినిమా ఏకంగా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. రీసెంట్గా బాలీవుడ్, హాలీవుడ్ లలో తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ప్రియాంక చోప్రా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న వర్క్ షాప్ సెట్స్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా ఈ వర్క్ షాప్ లో పూర్తి చేశారు మేకర్స్. ఇందులో ఆమె మహేష్ సరసన హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ.. ఇప్పుడు ఆమెను విలన్ పాత్రలో తీసుకున్నట్లు సమాచారం. ఇదివరకే ప్రియాంక బాలీవుడ్, హాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్‌లలో నటించి ఆకట్టుకుంది.
ముఖ్యంగా హాలీవుడ్ ఆడియన్స్ అయితే ఆమెను విలన్‌గానే ఎక్కువగా గుర్తుపడతారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర కోసం ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా.. హీరోయిన్‌ను కూడా బాలీవుడ్ నుంచే తీసుకోనున్నాడట జక్కన్న. ఇకపోతే ఈ సినిమా మహారాజ , గరుడ టైటిల్స్‌తో తెరకెక్కనుందని రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. కానీ.. పాన్ వరల్డ్ మొత్తానికి కామన్ టైటిల్ గా ఉండేలా.. జనరేషన్ అనే పదం వచ్చేట్టుగా టైటిల్ను ఫిక్స్ చేశాడట జక్కన్న. త్వరలోనే ఈ టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించనున్నాడు. అంతేకాదు.. ఇందులో తండ్రి పాత్ర కూడా ఎంతో స్పెషల్ గా ఉండనుందని.. ముందుగా ఈ పాత్ర కోసం అక్కినేని నాగార్జునని అనుకున్న.. ఇప్పుడు ఆ పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ నాన్న పటేకర్‌ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల మొదటివారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఇక ఈ సినిమా స్టోరీ చాలా పెద్దది అవడంతో.. మూడు భాగాలుగా సినిమాలను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడట రాజమౌళి.