సోషల్ మీడియా వేదికగా చాలా కాలం నుంచి ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. త్రో బ్యాక్ థీంతో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు, స్టార్ సెలబ్రెటీల పిక్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అల్లరి పిడుగులు పిక్స్ వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు బుడ్డోళ్ళు ఎవరో గుర్తుపట్టారా.. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు. అంతేకాదు ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోస్‌గా పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. ఒకరు మాస్‌లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటే.. మరొకరు అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా రాణిస్తున్నారు. ఇద్దరు కూడా తమిళ్ స్టార్ హీరోలు అయినా.. తెలుగులోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌తో దూసుకుపోతున్నారు.
ఇక ఈ ఇద్దరు బ్రదర్స్ కంటెంట్ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ.. తమ సత్తా చాటుతున్నారు. ప్రతి పాత్రలోనూ వైవిధ్యత చూపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎక్స్పరిమెంటల్ సినిమాలకు క్యారఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇంత చెప్పాం కదా.. ఇప్పటికైనా ఇద్దరు అన్నదమ్ములు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పటికి అప్పటికి పోలికల్లో చాలా తేడాలు ఉండడంతో అది కాస్త కష్టమే లెండి.. మేమే చెప్పేస్తాం. వాళ్లు మరెవరో కాదు కొలువుడు స్టార్ హీరోలు సూర్య, కార్తీ. 1997లో నేరుక్కునెర్ సినిమాతో హీరోగా సూర్య ఎంట్రీ ఇవ్వగా.. సరిగ్గా పదేళ్ల గ్యాప్ తర్వాత 2007లో పరుతి వీరన్ సినిమాతో కార్తీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక సూర్య హీరో గానే కాకుండా.. నిర్మాత గాను మంచి సక్సెస్‌తో రాణిస్తున్నాడు.
గజినీ, సింగం అగైన్, 24, నంద, జై భీమ్, సురైరపొట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలతో తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు సూర్య. ఇక ఇటీవల విక్రం సినిమాలో రోలెక్స్ పాత్రలో తన అద్భుత నటనతో కోట్లాదిమంది ప్రశంసలు దక్కించుకున్నాడు. చివరిగా కంగువా సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. నిర్మాతగాను మారి గార్గి సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఇక కార్తీ పరుతివీరన్ సినిమా తర్వాత.. యుగానికి ఒక్కడు, శకుని, చెలియా, దొంగ, సర్దార్, పొనియన్ సెల్వన్ లాంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ఖైదీ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. అంతే కాదు.. అలా ప్రస్తుతం ఇద్దరు అన్న దమ్ములు పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోలుగా బిజీ బిజీగా గడుపుతున్నారు.