ఫస్ట్ టైం ఓ రొమాంటిక్ హీరో సినిమాకు సై అంటున్న సాయి పల్లవి.. కారణం ఏంటంటే..?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి సౌత్ లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ అమ్మడు.. లేడి సూపర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా.. ఎంత‌ పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఆమెకు కంటెంట్ నచ్చి.. ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తే నటించే సాయి పల్లవి.. డి గ్లామ‌ర‌స్‌, రొమాంటిక్ సినిమాలకు కాస్త దూరంగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆడియన్స్ మెచ్చే, తన మనసుకు నచ్చే కంటెంట్ ను ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడి క్యారెక్టర్‌కు మరింతమంది కుర్రకారు ఫిదా అవుతుంటారు. అలాంటి సాయి పల్లవి మొట్టమొదటిసారి తన సినీ కెరీర్‌లో ఓ రొమాంటిక్ హీరోతో నటిస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఆ రొమాంటిక్ హీరో ఎవరు.. అసలు ఏ సినిమాలు సాయి పల్లవి నటించనుంది.. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న హీరో సింబుకు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ప్రస్తుతం నాలుగు సినిమాల పనులలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ఆయన నటించిన ఈ నాలుగు సినిమాల్లో ఎస్‌టిఆర్ 49 సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను పార్కింగ్ మూవీ ఫేమ్ రామ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇక సింబు ఓ కాలేజ్ స్టూడెంట్ గా మెరవ‌నున్నాడు. అయితే తాజాగా సింబుకి జోడిగా సాయి పల్లవి నటించ‌నుంద‌నే న్యూస్ హాట్‌ టాపిక్‌గా మారింది. సింబు కోలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. గతంలో మన్మధ, వల్లభ లాంటి సినిమాల్లో బోల్డ్ రొమాన్స్‌తో ఆకట్టుకున్న సింబు సరసన.. సాయి పల్లవి నటిస్తుందని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.

STR49 movie: சிம்பு படத்தில் ஜோடி சேரும் அமரன் பட நாயகி.. அட மீண்டும்  காமெடியனா சந்தானம் ஜாயினிங்கா? | Actress Sai Pallavi and Comedy actor  Santhanam seems to join Simbu's STR49 ...

సాయి పల్లవి సినీ కెరీర్‌లోనే మొదటిసారి ఇలాంటి ఓ రొమాంటిక్ హీరోతో ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాలి. దాదాపు రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉండే ఈ అమ్మడు.. శింబుతో కలిసిన నటించబోయే ఎస్‌టిఆర్ 49 సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది. సినిమాల్లో కాలేజ్ స్టూడెంట్ గా సింబు క‌నిపించ‌నున్నాడు అంటే కచ్చితంగా లవ్ సీన్స్ ఉండనే ఉంటాయి. అలాంటిది సినిమాలో సాయి పల్లవి న‌టించ‌డానికి కారణం రొమాన్స్ లిమిట్ లోనే ఉంటుంద‌ని.. అలాగే కంటెంట్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా.. తన పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉండేలా ఉందని.. అందుకే సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని సమాచారం. ఎస్‌టిఆర్ 49 సినిమాతో సింబుతో బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజ‌న్స్‌.