సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అందుకున్న మురారి సినిమా స్టోరీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ శాపం కారణంగా అతి చిన్న వయసులోనే ఆ కుటుంబానికి చెందినవారు చనిపోతూ ఉంటారు. అలా.. నిజజీవితంలోనూ ఓ బాలీవుడ్ యాక్టర్ కుటుంబం 50 ఏళ్లకు మించి ఎవరు బ్రతకడం లేదట. అలా ఇప్పటివరకు వరుసగా మూడు జనరేషన్లు 50 ఏళ్ల వయసులోపే మరణించారు. ఇంతకీ ఆ బాలీవుడ్ నటుడు ఎవరోకాదు సంజీవ్ కుమార్. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన సంజీవ్ కుమార్ అసలు పేరు హరిహర జట్‌టాల్ జరీవాలా. 1938 జూలై 9న గుజరాత్ లోని సూరత్ లో జన్మించిన ఆయన.. బాలీవుడ్‌లో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. సంజీవ్ కుమార్ తన విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. రొమాంటిక్, కామెడీ సినిమాలే కాదు, వైవిధ్యమైన పాత్రలోను తనదైన నటనతో మెప్పించాడు.
షోలే, అంది, కోషిష్, దస్తక్, కిలాడి, అనామిక, త్రిశూల్ కిలోన లాంటి సూపర్ హిట్ సినిమాల్లో సంజీవ్ కుమార్ హీరోగా నటింయారు. ఇక తన నటనకు ఉత్తమ నటుడుగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలను దక్కించుకున్న సంజీవ్.. నటుడుగానే కాదు, నిర్మాతగాను మారి.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచాడు. అయితే.. ఆయన కెరీర్‌లో వివాహం చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయాడు. హేమమాలినితో సన్నిహితంగా మెలిగిన సంజీవ్ కుమార్.. తర్వాత నటి సులక్షణ పండిట్‌తో రిలేషన్ మెయింటైన్ చేశాడు. అయితే సంజయ్ కుమార్ పెళ్లికి నిరాకరించడంతో.. సులక్షణ పండిట్ పెళ్లి చేసుకోకుండా సోలోగా మిగిలిపోయింది.
1985 నవంబర్ 6న సంజీవ్ కుమార్ గుండెపోటుతో ముంబైలో తుది శ్వాసగా విడిచాడు. ఆయన చనిపోయేనాటికి సంజయ్ కుమార్ వయస్సు కేవలం 47 ఏళ్లు మాత్రమే. ఇక సంజీవ్ కుమార్‌కి పుట్టుకతోనే గుండె సంబంధిత లోపం ఉంది. ఇతనికి 1979లో మొదటిసారి హార్ట్ ఎటాక్ రాగా.. తర్వాత 1985 నవంబర్ 6న మరోసారి గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో మరణించారు. విచిత్రం ఏంటంటే ఆయన కుటుంబంలో 50 ఏళ్లకు మించి ఎవరూ బ్రతకడం లేదు. సంజీవ్ కుమార్‌తో పాటు.. వాళ్ళ తాత, తండ్రి, తమ్ముడు నిక్కుల్‌తో సహా అతడి కుటుంబంలోని చాలామంది మగవారంతా.. 50 ఏళ్ళు నిండకముందే మరణించారు. దీంతో కుటుంబానికి ఏదో శాపం ఉందని.. అందుకే అలా జరుగుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.