దర్శక ధీరుడు రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచమంతా తలెత్తి చూసా రేంజ్‌కు తీసుకువచ్చిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి పేరు వినిపిస్తుంది. అలాంటి రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాస్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది.
ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలని కసితో మరింతగా కంటెంట్‌పై, డైరెక్షన్‌పై కేర్ తీసుకొని మరి తెరకెక్కిస్తుంటాడు జక్కన్న. అందుకే ఆయన సినిమాలకు బీసీ సెంటర్లలో కూడా విపరీతమైన ఆదరణ దక్కుతుంది. రిపీటెడ్ ఆడియన్స్‌తో సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది. ఇక జక్కన్న సినిమాలు ఎలా తీస్తాడో అందరికీ తెలిసిందే. 12 సినిమాలలో 12 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అంటేనే జక్కన్న సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ కూడా రాజమౌళితో సినిమా చేయాల్సి ఉందట. కానీ అనుకొని కారణాలతో ఈ సినిమా సెట్స్‌పైకి రాలేదు.
ఇదిలా ఉంటే చిరంజీవికి.. రాజమౌళి తీసిన సినిమాలన్నింటిలో ఓ సినిమా అంటే అసలు నచ్చదని తెలుస్తుంది. అదే మర్యాద రామన్న. మర్యాద రామన్న మినహాయించ్చి అన్ని సినిమాలను చిరు ఎంతగానో ఇష్టపడతారట. ఇక మర్యాద రామన్న సినిమా అంటే చిరుకు ఎందుకు నచ్చదో చెబుతూ ఈ సినిమా రాజమౌళి స్టాండర్డ్ కు తగ్గ సినిమా కాదని.. తన పందా మార్చుకొని ఒక కామెడీ సినిమా తీయాలని ఉద్దేశంతోనే ఆ సినిమాను తెరకెక్కించాడని.. నిజానికి రాజమౌళి స్టాండర్డ్ సినిమా అయితే వేరే లెవెల్ లో ఉంటుందని.. అభఙప్రాయాని వ్యక్తం చేసినట్టు సమాచారం.