ప్రతి ఏడాది ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అయితే అవకాశాలు దక్కించుకోవడమే పెద్ద టాస్క్ అంటే.. వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. సినిమాలో అంత కష్టపడి నటించిన తర్వాత ప్రాజెక్ట్ పూర్తయి వాళ్ళు చేసిన సీన్లు ఉంటాయో.. లేదో కూడా సందేహమే. అలా ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ ఆర్టిస్టులుగా ఎదిగిన వారు.. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల్ గా మారాలంటే దానికి తగ్గ టాలెంట్‌తో పాటు.. పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. అందం, అభినయం ఉన్న చాలా మంది నటీమణులు సరైన సక్సెస్‌లు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాంటి సంఘటన తన లైఫ్‌లో జరిగిందంటూ ఓ టాలీవుడ్ హీరోయిన్ తన లైఫ్ కు సంబంధించిన షాకింగ్ విషయాన్ని రివిల్ చేసింది. తాజాగా ఆ హీరోయిన్ మాట్లాడుతూ.. స్టార్ హీరో కారణంగా తన కెరీర్ సర్వనాశనం అయిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు మనోచిత్ర. 2010లో నందికి అనే స్క్రీన్ పేరుతో నటనలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకాంత్ హీరోగా నటించిన మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమాలోని హీరోయిన్గా మెరిసింది. తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించింది.
అయితే తాజాగా ఈమె తమిళ్ స్టార్ హీరో అజిత్‌ను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన వల్లే తన కెరీర్ నాశనం అయిపోయిందంటూ చెప్పుకొచ్చింది. అజిత్ హీరోగా నటించిన వీరం సినిమా డైరెక్టర్ శివ తనను మోసం చేశారంటూ ఎమోషనల్ అయింది. అజిత్ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇస్తానని చెప్పి ఆయన మోసం చేశాడని చెప్పుకొచ్చింది. వీరం సినిమాలో తమన్నా క్యారెక్టర్ చనిపోతుందని.. ఆ తర్వాత సినిమాలో నువ్వే హీరోయిన్ అని చెప్పారని.. కానీ సినిమాలో అలాంటిదేమీ జరగలేదంటూ చెప్పుకొచ్చింది మానోచిత్ర. ఇక డైరెక్టర్ శివ దగ్గర ఆ విషయంపై ఏడ్చానని.. ఏడుస్తున్నప్పుడు కూడా మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ నన్ను ఓదార్చారని.. అజిత్ కోసం ఈ సినిమాలో నటించా. ఆ సినిమా నా సినీ లైఫ్ ని నాశనం చేసింది అంటూ ఆమె విమర్శలు చేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత తనకు అవకాశాలు రాలేదని మనోచిత్రా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.