టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్.. తాజాగా నటించిన మూవీ లైలా. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా.. కొద్ది గంటల క్రితం హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. దానికి చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా హాజరై సందడి చేశాడు. తన వేడుకకు ముఖ్యఅతిథిగా వస్తున్న చిరంజీవికి మాస్ కా దాస్.. విశ్వక్ తాజాగా కొత్త ట్యాగ్ యాడ్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఎస్ మీరు విన్నది నిజమే.. చిరంజీవికి విశ్వక్ సేన్ ఇచ్చిన ఆ కొత్త ట్యాగ్ బాస్ ఆఫ్ మాసేస్. దీనిపై మెగా అభిమానులు ఇంకా ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో.. మరి కొంతసేపు వేచి చూస్తే కానీ తెలియదు.
మాస్ కా దాస్ కోసం బాస్ ఆఫ్ మాసెస్ వస్తున్నారు అంటూ లైలా మూవీ టీం ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక చిరంజీవి కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో ట్యాగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మొదట నట కిషోర్, డైనమిక్ స్టార్, రోరింగ్ లయన్, రోలింగ్ స్టార్ లాంటి బిరుదులు పొందిన మెగాస్టార్.. కొండవీటి సింహం సినిమా తర్వాత సుప్రీం హీరో బిరుదును అందుకున్నాడు. ఆ ట్యాగ్ చాలా రోజులు కొనసాగిన తర్వాత సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
చిరంజీవి ఇప్పటివరకు అదే బిరుదు ఆడియన్స్‌లో ముద్ర వేసుకుంది. మరి ఇప్పుడు విశ్వక్ సేన్ ఇచ్చిన ఈ కొత్త ట్యాగ్‌పై చిరు అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం హీరోలకు ట్యాగ్ ఇచ్చే క్రమంలో మాసేస్ అనేది బాగా వైరల్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే నందమూరి హీరోలు బాలయ్యకు గాడ్ ఆఫ్ మాసేస్, నటసింహ అనే టాగ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ను యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసేస్ అనే బిరుదులతో పిలుస్తున్నారు. ఇలాంటి క్రమంలో విశ్వక్.. చిరంజీవిని బాస్ ఆఫ్ మాసేస్ అనడం ప్రారంభించారు. ఇక ఈ బిరుదు ఎంతవరకు ప్రజల్లో ట్రెండ్ అవుతుందో వేచి చూడాలి.