కేవలం 9 రోజుల్లో ఏడు వేల కోట్లు కొల్లగొట్టిన మూవీ ఏదో తెలుసా.. పుష్ప 2,దంగల్ కానే కాదు..!

బాలీవుడ్ స్టార్ హీరో అమెర్‌ఖాన్ నటించిన దంగల్ సినిమా చాలా కాలం పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నితీష్‌తివారి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి పాన్ ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 ఇటీవల రికార్డ్‌ను బ్రేక్ చేస్తుందని చాలామంది భావించినా.. అది సాధ్యం కాలేదు. అయితే ఇటీవల వచ్చిన ఒక కొత్త సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఏకంగా రూ.7000 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టింది.

pushpa 2 crosses 1799 cr rs world wide very close to break aamir khan  dangal record Box Office: पुष्पा 2 साल 2025 में दंगल का तोड़ेगी रिकॉर्ड?  देखें नंबर 1 बनने की रेस में कितनी पीछे, Bollywood Hindi News - Hindustan

ఆ సినిమా ఏంటో ఒకసారి చూద్దాం. ఆ సినిమా పేరే నీఝా 2. చైనీస్ బాక్స్ ఆఫీస్‌ను ఈ సినిమా షేక్‌చేసి పారేస్తోంది. 2025 జనవరి 29న రిలీజ్ అయిన ఈ సినిమా.. యానిమేటెడ్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. టీవీ9 హిందీ రిపోర్ట్ ప్రకారం నీఝా 2 సినిమా ఇప్పటికీ 580 మిలియన్ చైనీస్ యువన్ వసూలు కొల్లగొట్టింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 7వేల కోట్లని సమాచారం. చైనాలో లూనార్ న్యూ ఇయర్ సెలవల సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. మొదటి రోజే ఈ సినిమా ఏకంగా 68 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.560 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టింది.

Ne Zha 2 - Wikipedia

తర్వాత అదే జోరు కొనసాగిస్తూ మొదటి వారంలో 666 మిలియన్ డాలర్లు అంటే రూ.5500 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా మైండ్ లాక్ అవ్వాల్సిందే. హాలీవుడ్, చైనీస్ బ్లాక్ బస్టర్ సినిమాల కలెక్షన్లు కూడా మించిపోయింది. కేవలం 9 రోజుల్లో ఈ సినిమా చెన్నైలో గతంలో రిలీజై హైయెస్ట్ కలెక్షన్లు కలగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. బ్యాటిల్ ఎట్ లేక్ చాంగ్జిన్ సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేసి పడేసింది. ఇక ఈ సినిమా రానున్న రోజుల్లో దాదాపు రూ.12,000 కోట్లు దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.