టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లు వార్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో కాస్త గొడవ సర్దుమనిగింది అనిపించినా.. ఇటీవల కాలంలో మళ్ళీ ఇదే వార్తలు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడెప్పుడు జరిగిన పాత సంఘటనలను, విషయాలను కూడా గుర్తు చేసుకుని మరి సెలబ్రిటీల మధ్యన చిచ్చు పెడుతున్నారు జనం. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో మరోసారి మెగా వర్సెస్ అల్లు వార్ హీట్ పెంచేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో అల్లు అర్జున్.. రామ్ చరణ్‌ను ఉదేశిస్తూ మాట్లాడిన మాటలను మరోసారి వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఒకేసారి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఇండస్ట్రీకి చాలా నష్టం కలుగుతుందని.. గతంలో దాసరి నారాయణరావు చేసిన కామెంట్స్ అందరికి గుర్తుండే ఉంటాయి.
ఇక 2015లో రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమా, అలాగే అనుష్క నటించిన రుద్రమదేవి సినిమాలు రెండు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కావడంతో అప్పట్లో రెండు సినిమాలు మధ్య టాప్ కాంపిటీషన్ ఏర్పడింది. ఈ క్రమంలోనే బ్రూస్లీ సినిమా కారణంగా రుద్రమదేవి ఫ్లాప్ గా నిలిచింది. దీంతో దాసరి నారాయణరావు ఓ మాట్లాడుతూ పండగ టైం లోనే సినిమాలు రిలీజ్ చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఏ స్టార్ హీరో సినిమాలైనా పండగతో సంబంధం లేకుండా ఎప్పుడు రిలీజ్ అయిన ఫ్యాన్స్ కు పండుగ వాతావరణమే క్రియేట్ అవుతుంది. చేతకాని వాళ్లు పండగ మూమెంట్ అడ్డం పెట్టుకొని అప్పుడు సినిమా రిలీజ్ చేయాలని చూస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే అదే టైంలో అల్లు అర్జున్.. రామ్ చరణ్ సినిమాకు సపోర్ట్ గా మాట్లాడారు. ప్రస్తుతం అవే కామెంట్ వైరల్ గా మారుతున్నాయి.
చరణ్ సినిమాను వెనక్కినెట్టాలి అనుకోవడం సరైన పద్ధతి కాదు.. ఎందుకంటే మూడు నెలల ముందే బ్రూస్లీ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించేసింది. కొన్ని కారణాలతో రుద్రమదేవి సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. మొదట సెప్టెంబర్‌లో అనుకున్నది అక్టోబర్‌లో రిలీజ్ చేశారు. అందువల్ల బ్రూస్లీ సినిమాతోనే రుద్రమదేవి రిలీజ్ అవ్వడం క్లాష్ గా మారింది అంటూ వెల్లడించాడు. దీనికి ఎవరు బాధ్యులు కారని.. ఇందులో ఎవరి తప్పులేదు అంటూ వివరించిన అల్లు అర్జున్.. చరణ్ సినిమాను ఆలస్యంగా రిలీజ్ చేయాలనుకోవడం.. అలా చెప్పడం కూడా సరైన పద్ధతి కాదు అంటూ చెప్పుకొచ్చాడు. అప్పట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ రాంగ్ వేల పోట్రేట్ కావడంతో.. దాసరి నారాయణరావు, అల్లు అర్జున్ల మధ్య వార్ జరిగిందంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.