టాలీవుడ్ మెగా పవర్ స్టార్‌గా రాంచరణ్ తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. రెండవ సినిమా మగధీరతోనే ఇండస్ట్రియల్ రికార్డ్‌లను బద్దలు కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ లాంటి డిజాస్టర్ ఎదురైనా.. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న.. ఎక్కడ వెనకడుగు వేయలేదు. రంగస్థలం లాంటి సినిమాతో మరోసారి రీజనల్ ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించి.. కోట్లాదిమంది ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో నటించిన మరో మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ ట్యాగ్ దక్కించుకున్నాడు. కేవలం మన ఇండియాలోనే కాదు జపాన్, అమెరికన్ ప్రాంతాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికీ జపాన్ లో ఈ సినిమా ఆడుతూనే ఉందంటే అక్కడ ఆడియన్స్‌లో సినిమాకు ఎంత గుర్తింపు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇటీవల చరణ్ నుంచి వచ్చిన గేమ్ ఛేంజర్ రిజల్ట్ బెడిసికొట్టినా.. బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో వస్తున్న సినిమాతో మరోసారి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కసితో ప్రయత్నిస్తున్నాడు చరణ్. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. తన కెరీర్‌లో ఎన్నో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. వాటిలో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలు కూడా ఉంటాయి. అలా చరణ్ కూడా తన సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్, కల్ట్ క్లాసికల్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. వాటిలో దుల్కర్ సల్మాన్ హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఓకే బంగారం మూవీ ఒకటి. తమిళ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా, గౌతమ్ వాసుదేవ్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ఎటో వెళ్లిపోయింది మనసు.. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.
అలాగే.. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన డార్లింగ్ సినిమాలో మొదట హీరోగా చరణ్‌ను తీసుకోవాలని కరుణాకర్ భావించారు. అయితే అప్పటికే ఆరెంజ్ సినిమా సైన్ చేయడంతో డార్లింగ్ సినిమాను చరణ్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కూడా.. మంచి టాక్ తెచ్చుకుంది. అంతేకాదు సూర్య హీరోగా తెరకెక్కించిన క్లాసికల్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్. ఈ సినిమాకు ముందుగా గౌతమ్ మీనన్.. రామ్ చరణ్‌ను హీరోగా భావించాడట. కానీ.. అప్పటికి వరుస ప్లాపుల్లో ఉన్న గౌతమినన్ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు చరణ్ ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. ఇలా చరణ్ కెరీర్‌లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్‌సి16లో బిజీగా గడుపుతున్నారు.