టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఆటిట్యూడ్, నటనతో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. మొదట చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ హీరో.. తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. రౌడీ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారుతున్న.. క్రేజ్ రిత్యా అవకాశాలను అందుకుంటునే ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వీడి 12 సినిమాలో నటిస్తున్నాడు విజయ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది.
ప్రస్తుతం వీడీ 12 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్, టీజర్‌ని ఈ నెల 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేశారు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్, పర్సన్ ఫర్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమాను మార్చి 28న గ్రాండ్గా రిలీజ్ చేయనన్నారు. ఇదిలా ఉంటే రౌడీ హీరో సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్న క్రమంలో.. ఆయనకు సహాయంగా పలు ఇండస్ట్రీలో నుంచి పలు స్టార్ హీరోలు రంగంలోకి దింపతున్నారట మేకర్స్.
అంటే టీజర్ వాయిస్ వరకు ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో హీరో విజయ్ దేవరకొండను ఎలివేట్ చేయనున్నారు. హిందీ టీజర్‌కు రణ్‌బీర్, తెలుగు ఎన్టీఆర్, తమిళ్ సూర్య వాయిస్ ఓవర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. తెలుగులో విజయ్ దేవరకొండకు.. హెల్ప్ చేసేందుకు ఎన్టీఆర్ ముందుకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఈ న్యూస్ తెలిసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు. కాగా.. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడానికి విజయ్ దేవరకొండ అహర్నిశలు శ్రమిస్తున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.