టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న తాజా మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక కీలక పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది.ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలలో వేసిన సెట్లో ప్రస్తుతం సినిమా షూట్ సైలెంట్ గా చేసేస్తున్నాడు రాజమౌళి. తర్వాత షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ కు తండ్రి పాత్ర కూడా చాలా కీలక కానుందని టాక్. ఈ క్రమంలోనే ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటించబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక సినిమా కాస్టింగ్ పని పూర్తి చేసిన జక్కన.. ప్రెజెంట్ సినిమా టైటిల్ విషయంలో అన్వేషణలు మొదలుపెట్టినట్లు సమాచారం. మహారాజు, గరుడ అనే టైటిల్స్ గతం నుంచే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ రెండు టైటిల్స్ పాతగా అయిపోయాయని.. వాటిని పక్కన పెట్టి ఈ జనరేషన్‌కు మరింత దగ్గర అయ్యేలా జెనరేషన్ అర్థం వచ్చేలా.. ఓ పాన్ వరల్డ్ టైటిల్ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక సినిమా కథలో కూడా తరతరాలకు లింకు ఉంటుందని.. అందుకే టైటిల్ యాప్ట్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఏ విషయాలు బయటకు రివిల్ కాకుండా రాజమౌళి పగడ్బందీగా ప్లాన్ చేశాడు. కనీసం ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి కూడా బయటకు మీడియాకు రివిల్ కానివ్వలేదు. మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నా వాటిపై రియాక్ట్ కావడం లేదు. ఇక రాజమౌళి ఈ సినిమా విషయాలను చెప్పేందుకు మీడియా ముందుకు ఎప్పుడు వస్తారో.. సినిమాపై వైరల్ అవుతున్న వార్తులకు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.