నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు అన్ని వరుసగా బ్లాక్ బస్టర్లు గా నిలుస్తున్నాయి. అంతేకాదు.. రాజకీయాలోను వరుస సక్సెస్‌లు అందుకుంటున్న బాలయ్య.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవరంగంలోనూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పద్మ విభూషణ్ అవార్డును కూడా బాలయ్య సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే వీళ్ళ కాంబోలో మూడు సినిమాలు తెరకెక్కి.. మూడు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
కాగా.. గతంలో వచ్చిన అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వల్‌గా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. అఖండ 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఇప్పటికే సినిమా పూజ కార్యక్రమాలను ముగించుకున్న టీం.. ఇప్పుడే సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమాపై ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఓ పాత్ర నెగటివ్, మరో పాత్ర పాజిటివ్ గా ఉండనుందని సమాచారం. ఇక ఈ సినిమా ఇంటర్వెల్‌లోనే బాలయ్య సెకండ్ రోల్ రివిల్ కానుందట. సినిమా మొత్తానికి ఆ రోల్ రివీల్ అయ్యే సిక్వెన్స్ హైలెట్ నిలవనుందని సమాచారం. ఇక ప్రస్తుతం సినిమా పూర్తి కాస్టింగ్‌పై డైరెక్టర్ బోయపాటి ఫోకస్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఇప్పటికే కీలక పాత్రల కోసం ఇతర భాషల్లో నటినటులను సెలెక్ట్ చేసి షూటింగ్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాను 14 రియల్ ప్లస్ బ్యానర్‌పై.. రామ్ అచంట, గోపీచంద్ అచంట ప్రొడ్యూసర్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లోనే ఒక్కింత భారీ బడ్జెట్‌లో పాన్ ఇండియన్ సినిమాగా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇక బాలయ్యను మ్యూజిక్ పరంగా మాస్‌గా ఎలివేట్ చేయడంలో బ్లాక్ బస్టర్ అందుకున్న థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా మరోసారి వ్యవహరించనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలోను ఎన్నో హిట్ సినిమాలు పడ్డాయి. ఈ క్రమంలోనే బాలయ్య, బోయపాటి, థమన్ హ్యాట్రిక్ కాంబో అంటూ.. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.