టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్పతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాట తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ టాక్ వినిపించింది. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్.. పుష్ప సీరియస్ల కోసం కోల్పోయిన టైమ్ అంతా.. నెక్స్ట్ రిబోయే సినిమాలతో కవర్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న స్టోరీ చాలా పెద్దదని.. సినిమా పూర్తవులంటే దాదాపు రెండున్నర ఏళ్ల వరకు పడుతుందని సమాచారం.
ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సినిమా పెద్ద స్కెడ్యూల్‌ను ఈ ఏడిది సమర్‌లో పూర్తి చేసేసి.. అట్లీ సినిమాకు షిఫ్ట్ అవ్వాలనే ప్లాన్ చేస్తున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ సినిమాను పక్కనపెట్టి మొదట అట్లీ సినిమాను పూర్తి చేసేసేలా ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. ఈ విషయం తాజాగా జరిగిన పుష్ప ఫంక్షన్ ఈవెంట్లో తన సన్నిహితులతో బన్నీ షేర్ చేసుకున్నట్లు టాక్. అంతేకాదు ఈ విషయంపై.. పుష్ప 2 పార్టీ జరగడానికి ఒక రోజు ముందే అట్లీ టీంకు సంబంధించిన ఓ వ్యక్తి బన్నీని కలిశాడట. దీనిపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అట్లీ సినిమాను వెంటనే మొదలుపెట్టి.. వచ్చే ఏడాది సమ్మర్‌కు పూర్తి చేసి రిలీజ్ చేసేసేలా ఆలోచనలు చేస్తున్నాడట బన్నీ.
అలా కాకుండా త్రివిక్రమ్ సినిమా, అట్లీ సినిమా రెండు ఒకేసారి సెట్స్‌పైకి వస్తే.. మరింత ఇబ్బంది అవుతుందని.. అట్లీ సినిమా పూర్తి అవడానికి కూడా వచ్చే ఏడాది చివరి వరకు సమయం పట్టేస్తుంది.. అంతేకాకుండా త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే చాలా సమయం పడుతుంది.. ఈ క్రమంలోనే రెండు సినిమాలు ఒకేసారి చేయకుండా అట్లీ సినిమా పూర్తి చేసేసిన తర్వాత.. త్రివిక్రమ్ సినిమాకు ఫుల్ టైం కేటాయించాలని భావిస్తున్నాడట అల్లు అర్జున్. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ సినిమాకు హారికా హాసిని క్రియేషన్స్ తో పాటు, గీత సంస్థల సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇక అట్లీ సినిమాను సన్ నెట్వర్క్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో త్రివిక్రమ్ సినిమాకు మరికొంత కాలం ఈ తంటాలు తప్పవని తెలుస్తుంది. అట్లీతో సినిమా తీయడానికి త్రివిక్రమ్ క్యూలో నిలబడక తప్పేలా లేదు.