టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ స్టార్ హీరో గానే కాదు పర్సనల్ గాను తన మంచితనం, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్టీఆర్ నిజాయితీగల క్యారెక్టర్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. తాతకు తగ్గ మనవడిగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న తారక్.. వరుస సినిమాలో నటిస్తూ సక్సెస్ లో అందుకుంటున్నాడు. ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరియర్లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కో స్టార్స్ అంతా.. ఆయన గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. ఎంతో గౌరవిస్తాడని, అందరితో గర్వం లేకుండా మింగిల్ అవుతాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించాలని కోరిక వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
అలాంటి ఎన్టీఆర్ పక్కన ఈ హీరోయిన్ నటిస్తే బాగుండాలి చాలామంది అభిమానులు కోరుకుంటుంటారు. అలాంటి హీరోయిన్లలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎటకేలకు ఈ కాంబో ఫిక్స్ అయిందట. త్వరలోనే వీరిద్దరు కాంబోలో సినిమా సెట్స్ పైకి రానుంది అంటూ టాక్ నడుస్తుంది. ఇక సాయి పల్లవి నటన, డ్యాన్స్, మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన ప్రతి సినిమాతోనే ప్రశంసలు అందుకనే ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తే.. అది కూడా ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చేస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, తారక్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుందంటూ టాక్ వైరల్ అవ్వడంతో ఆడియన్స్‌లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఒకవేళ ఇదే కనుక వాస్తవం అయితే.. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చి.. రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 రికార్డులను పట్టా పంచలు చేసి.. సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో ఎన్టీఆర్‌కు జంటగా రష్మిక నటిస్తుందంటూ వార్తలు కూడా వినిపించాయి. మరి తారక్ రష్మికను ఫిక్స్ అవుతాడా.. లేదా ఫ్యాన్స్ కోరిక మేరకు సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకుంటాడో.. ప్రశాంత్ నీల్, తారక్ కాంబోలో నటించనున్న ముద్దుగుమ్మ ఎవరు.. తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.