బన్నీ పుష్ప 2 సక్సెస్ పై చిరు షాకింగ్ కామెంట్స్.. మెగ, నందమూరి ఫ్యాన్స్ వార్ పై కౌంటర్..!

మెగా వర్సెస్ అల్లుఅర్జున్ వార్ తాజాగా మరోసారి ఊపందుకున్న‌ సంగ‌తి తెలిఇందే. ఇక సోషల్ మీడియాలో అల్లు ఫాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వారైతే బద్ధ శత్రుత్వంల‌ అనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో యంగ్ హీరో విశ్వక్‌సేన్ లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న చిరంజీవి.. పుష్ప 2 గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా సక్సెస్ అయిన అంతా సంతోషిస్తామని.. ఎందుకంటే ఆ నిర్మాతలు మళ్లీ మాతో సినిమాలో చేయడానికి వస్తారు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే మా ఇంట్లో ఎంతమంది హీరోలు ఉన్నారు. అందరం కలిసి మెలిసి ఉండటం.. కలివిడిగా జీవిస్తాం.. అలాగని మా ఇమేజ్ తక్కువ అవుతుందా అంటూ చిరంజీవి కామెంట్స్ చేశాడు.

 

ఏవిలో పవన్ కళ్యాణ్ కనిపించగానే అంతా అరుస్తుంటే చూసి నేను చాలా గర్వపడ్డా అంటూనే.. వెంటనే బన్నీ నటించిన పుష్ప 2 ప్రస్తావని తీసుకొచ్చి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అంత పెద్ద హిట్ అవ్వడంతో నేను గర్విస్తున్న.. కొన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని సినిమాల్లో ఆడవు కానీ.. ఇండస్ట్రీలో సినిమా ఆడిందంటే ప్రతి ఒక్కరు కచ్చితంగా సంతోషించాలంటూ వెల్లడించాడు చిరంజీవి. ఇక పుష్ప 2 హిట్ కొట్టడం, అల్లు అర్జున్ వివాదాలు చోటుచేసుకున్న అనంతరం మొట్టమొదటిసారి చిరంజీవి పుష్ప 2 ప్రస్తావన తీసుకొచ్చి అల్లు అర్జున్ ప్రశంసించడం మెగా ఫాన్స్‌కు అలాగే అల్లు ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవి విశ్వక్‌సేన్ గురించి మాట్లాడుతూ.. మెగా, నందమూరి కాంపౌండ్ల గురించి విశ్వక్‌సేన్‌ను ప్రశ్న అడిగారు.. దానికి విశ్వక్ మా ఇంటికి కాంపౌండ్ ఉంది. ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు అని చాలా చక్కని సమాధానం చెప్పాడు. దానికి నేను విశ్వక్‌ను ప్రశంసిస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు.

Chiranjeevi Discusses Film Industry Unity, 'Pushpa 2' Success at Vishwak  Sen's 'Laila' Pre-Release Event - RTV English

ఇక ఓ హీరోను ఇష్టపడితే వాళ్లు ఇతర హీరో పై అభిమానం, ప్రేమ చూపించకూడదా.. మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే ఇష్టం.. అందుకని నేను వాడి ఫంక్షన్ కి, వాడి ఇంటికి వెళ్లడం మానేస్తున్నానా అంటూ చిరంజీవి కామెంట్స్ చేశారు. ఇక అభిమానులు వాల్ పోస్టర్లు చింపుకోవడం నేను చూసా.. నెల్లూరులో మా కజిన్స్‌లో ఒకరు రామారావు గారికి, ఒకరు ఏఎన్నార్ గారికి ఫ్యాన్స్. అప్పట్లో వాళ్లు తెగ కొట్టుకునే వారు. హీరోలు బానే ఉన్న అభిమానులు కొట్టుకుంటున్నారని ఆలోచన ఆ రోజు నుంచి నాకు స్టార్ట్ అయింది. ఫిలిం యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య సఖ్యత వాతావరణం ఏర్పాటు చేయాలని భావించా. మద్రాస్ లో హనీ హౌస్ పేరిట అందరం కలిసి పార్టీ చేసుకునే వాళ్ళం.

Vishwak Looked Glamorous In Laila: Chiranjeevi

ఇప్పటికీ మేమంతా ఎంతో కలిసికట్టుగా ఉన్నాం. బాలయ్య, వెంకటేష్, నాగార్జున అందరం కలిసే ఉంటాం. బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు నేను వెళ్ళా. మా మధ్య ఎలాంటి వార్స్ ఉండవు. అందరం చాలా కలివిడిగా ఉంటాం. అందరికీ ఇండస్ట్రీ ఒకటే కాంపౌండ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి ట్రైలర్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తను ఓ సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించిన చిరంజీవి.. సమ్మర్లో ఈ సినిమా ప్రారంభమవుతుందని, ఫుల్ ఆఫ్ కామెడి ఎంటర్టైలర్గా సినిమా తెరకెక్కనుందని చెప్పుకొచ్చాడు. ఇక సెట్స్‌లోకి ఎప్పుడు వెళ్తాను అని ఉత్సాహంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. సాహూ, కొణిదల సుస్మిత గోల్డ్ బాక్స్ బ్యానర్ల పై సినిమాను నిర్మిస్తారంటూ చిరంజీవి వెల్లడించాడు.