ఏంటి.. అఖండ 2 లో ఒక బాలయ్య చనిపోతాడా.. అసలు ట్విస్ట్ అదేనా..?

ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలో బాలయ్య సపరేట్ ఫ్యాన్ బేస్‌ ఏర్పరుచుకున్నారు. ఆరుపదుల వయసులోను వరుస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య.. ఇటీవల సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ సినిమాతో వరుసగా నాలుగో సారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ద‌క్కించుకున్నాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక మాస్ సినిమా వస్తుందంటే.. వెంటనే బాలయ్య పారే గుర్తుకు వచ్చేంతలా.. మాస్‌ సినిమాలకు క్యారఫ్ అడ్రెస్‌గా నిలిచాడు. అలాంటి బాలయ్య.. ప్రస్తుతం అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్న బాలయ్య.. ఆ సినిమాకు సీక్వల్గా అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు.

Akhanda 2 - Thaandavam': Release date of Nandamuri Balakrishna's film with  Boyapati Sreenu announced - The Hindu

ఈ క్రమంలోనే సినిమాపై ఎప్పటికీ ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కేవలం టాలీవుడ్ ఆడియన్స్‌నే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో తాండవం చేస్తుందంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక.. కథ‌ విషయాన్ని వస్తే.. నేచ‌ర్‌ పొల్యూట్ చేసేలా ఓ కార్పొరేట్ కంపెనీ విచ్చలవిడిగా వ్యాపారాలను చేస్తూ ఉంటుంది.. వాళ్ళందరినీ కంట్రోల్ లో పెట్టడానికి బాలయ్య తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక మరోపక్క అఘోర గెటప్‌లో ఉన్న బాలయ్య అందరికీ తనదైన స్టైల్‌లో బుద్ధి చెబుతూ ఉంటాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.

Balayya's "Akhanda 2" to hail temples, religious practices

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అఘోర పాత్ర కాకుండా.. ఆఫీసర్ పాత్రలో బాలయ్య చనిపోతాడని న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఆ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత.. అఘోర క్యారెక్టర్ సమాజంలోకి ఎంట్రీ ఇస్తుందట. అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకొనున్నాడు వేచి చూడాలి. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో మెట్టు ఎక్కే విధంగా న‌ట‌ విశ్వరూపాన్ని చూపించనున్నాడని సమాచారం. ఇక బోయపాటి, బాలయ్య కాంబోలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ హిట్టు అందుకున్న తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి కాంబోలో రానున్న సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఖాయం.. రికార్డులు బద్దలు కొడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.