టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య వరస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న క్రమంలో తండేల్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయిందని, చైతన్య అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడని జనాలు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సాధారణ ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా భారీ కలెక్షన్ల దిశగా అడుగులు వేస్తుంది. దాదాపు మూడు రోజులకు రూ.60 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందించింది.
ఇక నాగచైతన్య సినిమాకు బుక్ మై షో లో మూడు రోజులకు 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం అంటే అది గొప్ప విషయమే అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఓ స్టార్ హీరో సినిమాకు తప్ప.. మీడిల్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఈ రేంజ్ బుకింగ్స్ ఎప్పుడూ జరగలేదు. పాటలు జనాల్లోకి వెళ్తే ఏ రేంజ్‌లో ఓపెనింగ్స్ ఉంటాయో చెప్పడానికి.. సినిమా బెస్ట్ ఉదాహరణగా నిలిచింది. ఈ క్రమంలోనే మూవీ టీం సక్సెస్ టూర్‌ను రెండవ రోజు నుంచి ప్రారంభించేశారు. నిన్న విజయవాడ శైలజ థియేటర్లో మూవీ టీం పాల్గొని సందడి చేయగా.. హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఈ వేడుకలకు రాలేదు.
ఈ క్రమంలో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో వార్త వైరల్‌గా మారుతుంది. కేవలం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాత్రమే సాయి పల్లవి అగ్రిమెంట్ చేసుకున్నారని,, తర్వాత జరిగే ఈవెంట్‌కు.. తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసారని.. ఈ క్రమంలోనే మూవీ టీంకు సాయి పల్లవికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని టాక్ నడుస్తుంది. ఈ కారణంగానే సాయి పల్లవి సక్సెస్ టూర్‌లో కూడా పాల్గొనడం లేదని సమాచారం. అయితే.. మరోపక్క ఈ వార్తల్లో వాస్తవం లేదంటూ.. సాయి పల్లవికి హెల్త్ బాగోకపోవడం వల్లే డాక్టర్ ఇచ్చిన సలహామేరకు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుందంటూ.. అందుకే ఈ సక్సెస్ టూర్ లో భాగం కాలేకపోయిందంటూ టీం అఫీషియల్‌గా వెల్లడించారు. ఇదిలా ఉంటే త్వరలోనే సినిమా సక్సెస్‌మీట్‌లో గ్రాండ్ లెవెల్‌లో అరేంజ్ చేయనున్నారట మేకర్స్. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్ గా నాగార్జున రానున్నారని, సాయి పల్లవి కూడా ఈవెంట్లో పాల్గొనే సందడి చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తుంది.