టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా 156గా రూపొందుతున్న విశ్వంభర పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ సినిమా తర్వాత.. మెగాస్టార్ 157, 158 సినిమాలు ఎవరితో ఉండనున్నాయి.. బ్యాక్ డ్రాప్ ఏంటి అనే అంశాలపై ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఇప్పటికే మెగా 157 విషయంలో ఎంతోమంది దర్శకుల పేర్లు వైరల్ గా మారాయి. సీనియర్ డైరెక్టర్ నుంచి యంగ్ డైరెక్టర్ల వరకు ఎంతోమంది పేర్లు వినిపించాయి. అంతేకాదు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల పేర్లు ఎక్కువగా తెరపైకి వచ్చాయి.
ఈ క్రమంలోనే మెగాస్టార్ 157 రూపొందించే లక్కీ చాన్స్ ఎవరు కొట్టేసారో స్వయంగా చిరు పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఫులాఫ్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని.. అంతేకాదు ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో 158 సినిమాకు శ్రీకాంత్ ఓద్దెల దర్శకత్వం వహించనునట్లు క్లారిటీ వచ్చేసింది. అనిల్ మెగా 157ను సమ్మర్ లో ప్రారంభించనున్నాడని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ సినిమా సెట్స్ లో ఎప్పుడెప్పుడు అడుగు పెడతాను అంటూ ఎదురు చూస్తున్నానని వివరించాడు.
సినిమాలోని కొన్ని సన్నివేశాల గురించి అనీల్ చెబుతుంటే.. కడుపుబ్బ నవ్వుకున్నానని డైరెక్టర్ కోదండరామిరెడ్డితో పని చేసినప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చిందో.. అనిల్ తో సినిమా అంటే అలాంటి ఫీల్ కలుగుతుందని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి క్లారిటీతో 157వ సినిమాపై సందేహాలను తీరిపోయాయి. శ్రీకాంత్ ప్రాజెక్ట్ మాత్రం అనిల్ సినిమా పూర్తయిన వెంటనే ప్రారంభమవుతుందని టాక్. ఇది భారీ యాక్షన్ కంటెంట్ ఉన్న సినిమా.. రాక్షసుడు రేంజ్ లో చిరంజీవి పాత్ర ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.