సమంతను బ్లాక్ మెయిల్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్.. కారణం ఏంటంటే..?

స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దాదాపు 10 ఏళ్ల పాటు టాలీవుడ్ ను ఏలిన ఈ అమ్మడు.. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది. సినిమాల్లో హీరోయిన్‌గానే కాదు.. పుష్ప లాంటి పాన్‌ ఇండియన్ సినిమాలోని స్పెషల్ సాంగ్స్ లోను మెరిసి విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. అయితే తర్వాత మెల్ల మెల్లగా టాలీవుడ్‌కు దూరమైన ఈ ముద్దుగుమ్మ.. గత కొద్దిరోజులుగా తెలుగులో ఎలాంటి సినిమాలోను నటించడం లేదు.

బాలీవుడ్‌కు మక్కాం మార్చేసి.. అక్కడే పలు వెబ్ సిరీస్‌లలో బిజీగా గడుపుతుంది. ఇలాంటి క్రమంలో.. సమంతకు సంబంధించిన హాట్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారుతుంది. సమంత టాలీవుడ్‌లో వరుస‌ సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్న టైంలో.. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్ తన సినిమాలో చేయాలని సమంతను బ్లాక్ మెయిల్ చేసాడట. నేను చెప్పినట్లు సినిమాలో నటించకుంటే.. నీకు అసలు ఎలాంటి సినిమా అవకాశాలు రాకుండా చేసేస్తానని బెదిరించాడట. అంతేకాకుండా.. నీ అంతు చూస్తానని భయపెట్టేవాడట.

తమిళ్ ఇండస్ట్రీ వైపుకు రమ్మని చాలా ఒత్తిడి తీసుకువచ్చేవాడట. కానీ.. సమంత వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా నిలబడింద‌ని తెలుస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్ట్రాంగ్‌గా ఉంటూ సినిమాలు చేస్తూ ఇక్కడ స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో స‌మంత‌ సినిమాలు చేయకపోవడంతో అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ సమంత ఎప్పుడు టాలీవుడ్ సినిమాల్లో నటిస్తుందా అంటూ వేచి చూస్తున్నారు. ఇక టాలీవుడ్‌కు దూరమై రెండేళ్లు గడుస్తున్న.. ఇప్పటికి ఇండస్ట్రీలో అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇకపై అయినా సమంత సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఆ సినిమాపై మంచి అంచనాలు నెల‌కొంటాయి అనడంలో సందేహం లేదు.