అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్యకు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే నాగచైతన్య దరిద్రం ఏంటో కానీ.. ఎప్పుడూ ఎంత మంచి పని చేసినా.. ఏ పని చేసినా.. దానిలో నెటివిటినే వెతుక్కుంటూ నెగటివ్‌గా ట్రోల్స్ చేసి విమర్శలు కురిపిస్తూ ఉంటారు జనం. ముఖ్యంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇంత కాలమైనా ఒక్కసారైనా హిట్ కూడా కొట్టలేకపోయాడు. అసలు చైతు నటుడుగా పనికిరాడు అంటూ కామెంట్లు కూడా వినిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. స్టార్ హీరోలు సైతం చైతు సినిమా ప్రమోట్ చేయాలంటే ఇష్టపడేవారు కాదని టాక్. అలాంటి చైతు ఇటీవల తండేల్ సినిమాతో ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సాయి పల్లవి పర్ఫామెన్స్‌ను మించి నటనతో మెప్పించాడని.. ఆయనలో గొప్ప నటుడు ఉన్నాడంటూ ప్రశంసలు కురిపించారు ఆడియన్స్. ఇలాంటి క్రమంలో నాగచైతన్యకు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. చైరు తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశాడని.. ఆ సినిమాల్లో నటించి ఉంటే ఇప్పటికే తండేల్ లాంటి సక్సెస్ అందుకుని స్టార్ హీరోగా మారేవాడని చెప్తున్నారు. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం. నాచురల్ స్టార్ నాని కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన భలే భలే మగాడివోయ్ సినిమాలో మొదట హీరోగా నాగచైతన్యను అనుకున్నారట. ఆయన సినిమా రిజెక్ట్ చేయడంతో.. సినిమా నానికి వెళ్ళింది. సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమా కూడా చైతన్య రిజక్ట్ చేశాడు.
అంతేకాదు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ఎంత మంచి టాక్ తెచ్చుకుందో తెలిసిందే. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ రావు డైరెక్షన్లో వచ్చిన అఆ సినిమాను కూడా నాగచైతన్య చేయవలసింది. కానీ నాగచైతన్య ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలో నితిన్ నటించాల్సి వచ్చింది. సినిమా ఎంత మంచి సక్సెస్ అందుకుందో తెలిసిందే. అలా నాగచైతన్య తన సినీ కెరీర్లు ఎన్నో మంచి మంచి అవకాశాలను రిజెక్ట్ చేస్తూ తను నటించిన సినిమాలతో సక్సెస్ అందుకోలేక ట్రోలింగ్‌కు గురయ్యాడు. అంతేకాదు ప్రస్తుతం తండేల్ సినిమా అంత మంచి హిట్గా నిలిచినా కూడా.. కారణం శోభిత అని. తనని పెళ్లి చేసుకోవడం.. ఆమె లక్ వల్లే చైతన్యకు ఆ హిట్టు వచ్చిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి నాగచైతన్య పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. వీడు దరిద్రం ఏంటో గాని.. సక్సెస్ వచ్చిన కూడా హ్యాపీనెస్ లేకుండా వాళ్ళ ఖాతాలో వేస్తున్నారంటూ.. తెగ ట్రోల్స్ చేస్తున్నారు జనం.