టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఏలేసిన సమంత నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత మెల్లమెల్లగా టాలీవుడ్కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఆమ్మడు విడాకుల తర్వాత మానసికంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ మయోసైటీస్ పూర్తిగా కోలుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సినిమాలను బాగా తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ.. కేవలం బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ సమయాన్ని గగుసపుతుంది. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్న ఎప్పుడు ఏదో ఒక విషయంలో అమ్మడి పేరు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
అలా తాజాగా సమంత బయటకు వచ్చినప్పుడు మీడియాకు దొరికిన కొన్ని పిక్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో సమంత మొబైల్ స్క్రీన్ పై ఎవరి ఫోటో ఉందో రివీల్ అయింది. సమంత ఫోన్ చేతిలో పట్టుకొని కెమెరాకు స్టిల్స్ ఇస్తున్న క్రమంలో.. ఆమె వాల్ పేపర్ డిస్‌ప్లే అయింది. దానికి సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు వాల్ పేపర్ ఏంటో చెప్పలేదు కదా.. లింగభద్రాదేవి అమ్మవారి ఫోటో అని తెలుస్తుంది. ఇక సమంత క్రిస్టియన్ మతానికి చెందిన అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. చైతూతో ప్రేమలో పడిన తర్వాత ఆమె హిందూ దేవుళ్లను పూజించడం మొదలుపెట్టింది.
ఈ క్రమంలోనే చైతుకి డివోర్స్ ఇచ్చినప్పటికీ ఇంకా హిందూ దేవుళ్లను పూజిస్తూ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆమె వాల్ పేపర్ కూడా హిందూ అమ్మవారి ఫోటోలు పెట్టుకోవడంతో ప్రస్తుతం అమ్మడిపై ప్రశంసలు కొరుస్తున్నారు. ఓ చేతితో మొబైల్.. ఓ చేతితో బొకే పట్టుకుని బ్లాక్ కలర్ ట్రెడిషనల్ లుక్‌లో ఫోజులిచ్చిన సమంత పిక్స్ నెటింట వైరల్‌గా మారడంతో.. గుడ్ లుకింగ్ అంటూ.. నిజంగా హిందూ దేవుళ్ళ పై మీ భక్తి చాలా గొప్పది అంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు జనం. ఇక సమంత చివరిగా టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి సినిమా రిలీజై రెండేళ్లు అవుతున్న.. టాలీవుడ్‌లో తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు సమంత.