ఉదయభాను కూతుళ్లకు బ్రాహ్మణి స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

స్టార్ యాంకర్‌గా ఒకప్పుడు బుల్లితెరను ఏలేసిన‌ ఉదయభానుకు తెలుగు ఆడియ‌న్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడిపిన ఈ అమ్మడు.. తర్వాత ఏవో కారణాలతో బుల్లితెరకు దూరమైంది. కట్ చేస్తే కొంతకాలానికి ఓ వ్యక్తిని వివాహం చేసుకొని ఇద్దరు ట్విన్స్ కు జన్మనిచ్చింది. తర్వాత మళ్లీ బాలయ్య హీరోగా నటించిన ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌తో యాంకర్‌గా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాలకు ఆడియో ఫంక్షన్‌ల‌లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. టీవీ షోలో హోస్ట్గా వ్యవహరించింది.

Why Udayabhanu is not anchoring these days?

ఇక సాధారణ ఆడియన్స్ నుంచి స్టార్ సెలబ్రెటీల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆడుతున్న సోషల్ మీడియా వేదిక యూట్యూబ్. సీరియల్స్ సెలబ్రిటీస్, నుంచి స్టార్ యాంకర్స్, హీరో, హీరోయిన్ల వరకు అంత యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసి తమకు సంబంధించిన పర్సనల్ విషయాలుతోపాటు.. హ్యాపీగా మూమెంట్లను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉదయభాను కూడా తన యూట్యూబ్ జర్నీని ప్రారంభించింది. అందులో తన పర్సనల్ విషయాలతో పాటు.. పిల్లలకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ పోస్ట్లను షేర్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా ఓ వీడియోని షేర్ చేసుకుంది ఉదయభాను.

అందులో బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి తన పిల్లలకు వయోలిన్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు షేర్‌ చేసింది. స్పెషల్ పర్సన్ మీకు గిఫ్ట్ పంపించారు.. బాలయ్య మామ అంటే ఇక్కడ ఎవరికీ ఇష్టం అంటూ పిల్లలకు సర్ప్రైజ్ ఇచ్చిన బ్రాహ్మణి వీడియో వైరల్ గా మారుతుంది. ఇక బాలయ్య అంటే ఉదయభానుకు మొదటి నుంచి చాలా అభిమానం అన్న సంగతి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఉదయభాను ఓ సందర్భంలో తను ఇండస్ట్రీకి దూరమైన.. తన ట్విన్స్ పుట్టినప్పుడు ఒకే ఒక మెసేజ్ తో బాలయ్య ఇంటికి వచ్చి మరి పిల్లలను ఆశీర్వదించార‌ని.. ఆయనది ఎంతో గొప్ప మనసు అంటూ పొగడ్తలు కురిపించింది. ఇక బ్రాహ్మణి ఇప్పుడు ఉద‌య‌భాను పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడంతో.. బాలయ్య ఫ్యామిలీతో తన అనుబంధం ఎంతో స్ట్రాంగ్ గా ఉందో అమ్మడు చెప్పకనే చెప్పేసింది.